చంద్రబాబు రాజకీయంగా యోధానుయోధుడు. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్లుగా సంక్షోభాలను సవాళ్లను ధీటుగా తీసుకుని వాటి నుంచే విజయాలకు సోపానాలను నిర్మించుకుంటారు. అపర చాణక్యుడుగా పేరున్న చంద్రబాబుని 2021 అలా ఇలా బాధపెట్టలేదు. ఏడు పదుల వయసున్న ఈ రాజకీయ దిగ్గజాన్ని ఏకంగా ఏడిపించేసింది అంటే చిత్రమే.
చంద్రబాబుకు నిజానికి బ్యాడ్ పీరియడ్ 2018 నుంచే స్టార్ట్ అయింది అంటారు. ఆయన కేంద్రంలోని బీజేపీతో పొత్తుని కట్ చేసుకుని ధర్మ పోరాట దీక్షలంటూ చేసిన విన్యాసాలతోనే అన్ని ఇబ్బందులూ వచ్చాయని టీడీపీలోని వారు కూడా అనే మాట. ఇక 2019లో జరిగిన ఎన్నికలు అయితే టీడీపీ చరిత్రలో ఎన్నడూ చవి చూడని దారుణమైన ఫలితాలను అందించాయి. సినిమా పరిభాషలో చెప్పుకోవాలంటే డిజాస్టర్ అని వాడాలి.
అలాంటి చేదుని దిగమింగి అడుగులు వేస్తున్న టీడీపీకి 2020 కరోనా రూపంలో కదలనీయకుండా చేసింది. 2021లో కచ్చితంగా పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ పెద్దలకు ఆ ఆశ తీరలేదు సరికదా 2019 కంటే దారుణాతిదారుణం అనిపించేసింది. 2021ని చంద్రబాబు టోటల్ పొలిటికల్ కెరీర్ లోనే వెరీ వెరీ బ్యాడ్ ఇయర్ గా తమ్ముళ్ళు భావిస్తున్నారు.
ఈ ఏడాది మొదట్లో మొదలైన లోకల్ బాడీస్ ఎన్నికలు ఏప్రిల్ దాకా కొనసాగాయి. అయితే అన్నింటా వైసీపీదే ఏకపక్ష విజయం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాయకత్వాన ఎన్నికలు జరిగినా ఆయన దిగిపోయి నీలం సాహ్ని వచ్చినా కూడా సేమ్ సీన్. నో చేంజి అన్నట్లుగా తయారైంది. ఇక పరిస్థితి ఎంతదాకా వచ్చిందంటే బాబు తన జీవితంలో ఎన్నడూ చేయని పని కూడా చేశారు. ఏకంగా జిల్లా పరిషత్ ఎన్నికలనే బాయ్ కాట్ చేశారు. ఇది విమర్శలకు దారి తీసినా సిట్యువేషన్ అలా డిమాండ్ చేసింది మరి అంటారు తమ్ముళ్ళు.
ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ ఆశలు నెరవేరలేదు, గెలవమని తెలిసినా వైసీపీ మెజారిటీని బాగా తగ్గించినా విజయమే అనుకున్న టీడీపీ పెద్దలకు గతానికి మించి వైసీపీ మెజారిటీ రావడం అంటే మింగుడుపడని పరిణామంగా మారింది. ఆ మీదట వచ్చిన బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరమని చెప్పేసి ఊరుకోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నికల రాజకీయం బొత్తిగా టీడీపీకి కలసిరాలేదు.
అన్నింటికీ మించి బాబు స్వయంగా ప్రాతినిధ్యం వహించిన కుప్పంలో అయితే టోటల్ గా టాప్ టూ బాటం అన్నీ పరాజయాలే వెక్కిరించేశాయి. ఆఖరుకు మునిసిపాలిటీలో కూడా వైసీపీ పాగా వేసి బాబుని కార్నర్ చేసి పారేసింది. ఈ నేపధ్యంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బాబు ఫ్యామిలీ మీద అనుచిత కామెంట్స్ వైసీపీ నేతలు చేశారంటూ చంద్రబాబు ఏకంగా అసెంబ్లీనే వచ్చే ఎన్నికల దాకా బాయ్ కాట్ చేయడమే ఈ ఏడాది హైలెట్ అని చెప్పాలి.
చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చిన ఉదంతం అయితే జాతీయ స్థాయిలోనే అతి ముఖ్యమైన అంశమైంది. దానికి ముందూ వెనకా జరిగిన ఘటనలు చూస్తే ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడులు చేయడం, ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆఫీసుల మీద దాడులు చేయడం వంటివి కూడా ఉన్నాయి. ఇక టీడీపీ నేతల మీద వరసబెట్టి కేసులు పెట్టడంతో కూడా తమ్ముళ్ళు కొంత డీ మోరలైజ్ అవాల్సిన సీన్.
మొత్తానికి చూస్తే బీజేపీతో మైత్రి కలుస్తుందని ఢిల్లీ వెళ్ళిన బాబుకు అక్కడ మోడీ అమిత్ షా అపాయింట్మెంట్లు దొరక్కపోవడం, ఏ పార్టీలో అధికారికంగా పొత్తులు అన్నవి లేకపోవడం ఈ ఏడాది మైనస్ గానే చూస్తున్నారు. అన్ని రకాలుగా ఫైటింగ్ చేస్తూ వస్తున్న చంద్రబాబే డీ మోరలైజ్ అయ్యేలా 2021లో రాజకీయ పరిణామాలు జరిగాయని అనుకోవాలి. ఏది ఏమైనా బాబు తగ్గేదిలే అంటున్నారు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ ధీమాగా దూకుడుగా 2022లో అడుగులు వేస్తున్నారు. కొత్త స్నేహాలను కలిపే ఇయర్ గా కూడా దాన్ని తమ్ముళ్లు చూస్తున్నారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా 2021 అంటే మాత్రం టీడీపీ యావత్తు వణికేలా రచ్చ రచ్చ చేసేదింది. ఏడుపదుల మనిషిని సైతం ఏడిపించుకుని తిన్న ఇయర్ గా ఏపీ పొలిటికల్ హిస్టరీలో దీని రికార్డు ప్రత్యేకమే సుమా.