హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణంగా చోటుచేసుకున్న రాజకీయ వేడి ఇంకా చల్లారనేలేదు. అప్పుడే మరో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడటం తెలిసిందే. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించటానికి తెలంగాణ అధికారపక్షానికే పూర్తి అవకాశాలు ఉన్నాయి.
అసెంబ్లీతో పాటు.. స్థానిక సంస్థల్లోనూ తిరుగులేని అధిక్యతతో ఉన్న టీఆర్ఎస్ ఖాతాలోనే మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల్ని సొంతం చేసుకుంటుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూస్తే.. ఎంపీటీసీ.. ఎంపీపీ.. జెడ్పీటీసీలు కీలకం కానున్నారు. దీంతో.. వారిప్పుడు ఒక్కసారిగా సీన్లోకి వచ్చేశారు. ఇంతకాలం తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్ని వినతులు విన్నవించుకున్నా ఫలితం లేకపోవటంతో వారు నిరాశతో ఉన్నారు.
తాజాగా స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో తమ ఓట్లు కీలకంగా మారనున్న వేళ.. తమ డిమాండ్లను పరిష్కరించుకోవటానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి ఇదే సరైన సమయంగా వారు భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే తాజాగా ఎంపీటీసీ.. ఎంపీపీ.. జెడ్పీటీసీల సంఘం నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 15 లోపు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో తాము కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని వారు చెబుతున్నారు.
తమకు నిధులు.. విధులు కేటాయించకుండా కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తమ ఓట్లను వాడుకుంటున్నారని.. మిగిలిన వేళలో పట్టించుకోవటం లేదన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఎంపీటీసీలకు రూ.50 లక్షల నిధులు ఇవ్వాలని.. బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించే నిధులకు అదనంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ.. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం రియాక్టు కాకపోతే.. ఎన్నికలు జరిగే 12 స్థానాలకు తామే పోటీకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ తలనొప్పిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.