రాజీ అన్న పదం కొందరికే కలిసివస్తుంది. కానీ రాజీ అన్న పదం నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకూ చెల్లుబాటులో ఇవాళ లేదు. ఆ విధంగా రుజు వర్తనంలో ఉన్న మాట ఒక్కటి లేదు. కనుక రాజకీయంలో రెండు వర్గాలు, రెండు కు మించి మూడు, నాలుగు యుద్ధాలు తప్పక ప్రతిరోజూ జరిగితేనే బాగుంటుంది. అందుకనో ఎందుకనో జిల్లాలలో సమన్వయం లేదు. సంబంధిత లోపం ఉన్నా దిద్దుబాటు లేదు.
కొత్త మంత్రులు వచ్చారు. కొత్త నీరు వచ్చింది.. కొత్త నీరుతో పాటు పాత నీరు కూడా ఉంది. ఆ విధంగా అంతా ఆనందంలో ఉన్నారు.ఇదీ ఔరా అనిపించే నిజం! ఆ విధంగా అంతా సర్దుకుపోయి పనిచేస్తున్నారు..మంత్రులు మరియు పార్టీ లో పదవుల్లో ఉన్నవారు కూడా! అని అనుకోవడంలోనే వింత ఉంది అని సాక్షాత్తూ అధికార పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. వివాదాలు లేని రోజు ఉంటే బాగుంటుంది కానీ ఆ విధంగా ఉండడం ఏ రోజూ సాధ్యం కాకపోవడం ఓ విధంగా అధినాయకత్వానికి తలనొప్పే! చంద్రబాబు హయాంలో రెండు సార్లు వర్గీకరణలు వ్యవస్థీకరణలు అన్నవి లేవు. ఆ విధంగా ఆయన సేఫ్.
కానీ ఎక్కువ మందికి పదవులు ఇవ్వొచ్చు అని ఓ లాజిక్ తీసుకుని రెండు పర్యాయాలుగా మంత్రివర్గాన్ని ప్రమాణం చేయించిన వైనం ఓ విధంగా కొత్త సమీకరణం. ఇది పొలిటికల్ సర్కిల్స్ కు కొత్త. ఆ విధంగా చూసుకుంటే ఆంధ్రావనికే కాదు తెలంగాణకు కూడా కొత్తే ! ఎందుకంటే ఎవ్వరికి అయినా పదవి ముఖ్యం.
ఇంకా చెప్పాలంటే అధికారం లో ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి ప్రచారం ముఖ్యం. చెడు అయినా మంచి అయినా నా గురించి రాసుకోండి అని జనసేనను ఉద్దేశించి నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ అనే మాజీ మంత్రి అన్నారంటే అంతకుమించిన ఉదాహరణ ఏముందని?
ఇక తాజాగా పాత కొత్తలు అస్సలు కలవడం లేదు అన్న వాదన ఉంది. పాత కొత్తలు అంటే మంత్రివర్గంలో కాదు జిల్లాలలో అని అర్థం! ఉదాహరణకు నెల్లూరులో అనిల్ వర్గానికి, కాకాని వర్గానికి పోరు ఉంది. శ్రీకాకుళంలో అయితే పైకి ఆ తీవ్రత లేదు కానీ లోలోపల అంతర్మథనం అయితే దాసన్నకు ఉంది. ఆయనకు మరియు ఆయనతో పాటు ఆయన భార్య పద్మ ప్రియకు ఉంది.
ఆఖరి వరకూ లాబీయింగ్ నడిపిన దాసన్నకు ఇప్పుడు ప్రోటోకాల్ వెహికల్ లేదు. ఆ హంగూ మరియు ఆర్భాటం లేదు. అంతేనా ! తమ్ముడికి పదవి వచ్చిందని నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో వేడుకలు చేసినా రాలేదు. ఆ విధంగా బయట ఒకటి, లోపల మరొకటి అన్న విధంగా ఉంది వ్యవహారం. ఇదే విధంగా విశాఖ రాజకీయాలు ఉన్నాయి. అవంతి పైకి మౌనంగా ఉన్నా ఇప్పటిదాకా పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను కలవనే లేదు. జిల్లాలలో కలిసి పని చేయరు కానీ వీరంతా వచ్చే ఎన్నికల్లో జగన్ ను సీఎం చేయడం ఖాయం అని చెబుతుండడమే ఆశ్చర్యకరం.