సీఎంగా ఏడోసారి ప్రమాణస్వీకారం చేసిన నితీష్

Update: 2020-11-16 16:30 GMT
బీహార్ లో నాటకీయ పరిణామాల మధ్య కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ రోజు మరోసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. నితీష్ కుమార్ చేత ముఖ్యమంత్రిగా రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్ సీఎంగా నితీష్ ‌కు ఇది వరుసగా నాలుగోసారి కాగా , మొత్తంగా ఇది ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నేతలు తార్‌కిశోర్ ప్రసాద్, రేణు దేవి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 15 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వర్తిస్తున్న నితీష్, తాజాగా జరిగిన ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమి విజయం సాధించడంతో మళ్లి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇకపోతే , బిహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం అందుకుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఎం పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసినా సీఎం పీఠానికి కొంచెం దూరంలో ఆగిపోయింది. ఆర్జేడీ 75 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినా , సీఎం కుర్చీ అందని ద్రాక్షాలానే మిగిలిపోయింది. కేవలం 19 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కూటమి విజయావకాశాలను భారీగా దెబ్బతీసింది. డీయూ 43 సీట్లలో గెలుపొందగా.. బీజేపీ 74 సీట్లలో విజయం సాధించింది. జేడీయూ కంటే 31 సీట్లు ఎక్కువగా సాధించినప్పటికీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నితీశ్ కుమార్‌కే ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. ఇకపోతే , గత ప్రభుత్వ హయంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్ కుమార్ మోదీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది


Tags:    

Similar News