నివర్ ముప్పు తొలగకముందే ఏపీ కి పొంచి ఉన్న మరో పెను ముప్పు !

Update: 2020-11-27 16:15 GMT
నివర్ తుఫాన్ దెబ్బకి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం ఏపీని వణికిస్తున్న నివర్ ముప్పు తొలగిపోక మునుపే ఏపీకి మరో ముప్పు వెంటాడుతోంది. ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అది తీవ్ర వాయుగుండం కాస్తా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.

అలాగే , వచ్చే‌ నెలలో మరో రెండు తుఫాన్‌లు వచ్చే అవకాశం ఉందంటున్నార. డిసెంబర్‌2న, డిసెంబర్‌ 7న ఈ ప్రమాదం పొంచి ఉందంటున్నారు. దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నివర్ నివర్ తీవ్రవాయుగుండంగా కొనసాగుతుంది.. ఈ ప్రభావంతో రాగల 6 గంటల్లో వాయుగుండంగా ఆ తదుపరి అల్పపీడనంగా బలహీన పడనుంది. ప్రస్తుతానికి తిరుపతికి పశ్చిమ నైరుతిగా 30 కీమీ దూరంలో.. చెన్నైకి పశ్చిమ వాయువ్య దిశగా 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

శనివారం ఉదయానికి నివర్ ప్రభావం కొంతమేర తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి ,రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు.. వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపోర్లే అవకాశం ఉంది.


Tags:    

Similar News