మేన‌మామ‌ వ‌ర్సెస్ మేన‌ల్లుడు.. ఇదో రకం రాజ‌కీయం!?

Update: 2022-12-25 08:30 GMT
ఔను.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయాల‌కు భిన్న‌మైన రాజ‌కీయం ఇది. అదే.. వైసీపీకి చెందిన కీల‌క నాయ కుడు.. స్వ‌యానా.. సీఎం జ‌గ‌న్‌కు మేన‌మామ అయ్యే పోచిమ‌రెడ్డి ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి చుట్టూ..ఇప్పుడు క‌డ‌ప‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.  విష‌యం ఏంటంటే.. 2014కు ముందు వైసీపీలోకి వ‌చ్చిన పి. ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి.. జ‌గ‌న్ మాతృమూర్తి విజ‌య‌మ్మ‌కు స్వ‌యానా తమ్ముడు.

ఇక‌, క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న వ‌రుసగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తు త ఎమ్మెల్యేగా కూడా కొన‌సాగుతున్నారు. క‌మ‌లాపురంలో స‌హ‌జంగానే ఎమ్మెల్యే కాబ‌ట్టి.. ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి హ‌వానే న‌డుస్తూ ఉంటుంది.

ఈయ‌న స్వ‌యానా సీఎం జ‌గ‌న్‌కు మేన‌మామ కావ‌డంతో ఇక్క‌డంతా కూడా.. గంభీర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది.

కానీ, రాజ‌కీయంగా ఈ మేమ‌మామ‌కు.. మేన‌ల్లుడు వ‌రుస‌య్యే సీఎం జ‌గ‌న్‌కు మ‌ధ్య మాట‌లు లేవ‌ని.. వారి ద్దరూ కూడా..అంత‌ర్గ‌తంగా క‌ల‌హించుకుంటున్నార‌ని.. పెద్ద ఎత్తున క‌డ‌ప‌లో చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి ఆది నుంచి కూడా ఒకే ఇంట్లో పెరిగిన ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డితో వైఎస్ కుటుంబ స‌భ్యుల‌కు చ‌నువు ఎక్కువ‌. కానీ, రాజ‌కీయంగా జ‌గ‌న్ వ‌చ్చాక‌.. ప‌రిస్థితి మారిపోయింది.

వ‌య‌సు బంధుత్వంతో సంబంధం లేకుండా.. ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వివాదం.. ఇప్ప‌టికీ పార్టీలో ఉంది. ఈ క్ర‌మంలోనే మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి కుటుంబ విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డాన్ని జ‌గ‌న్ జీర్నించుకోలేక పోతున్నార‌ని.. అంటున్నారు.

ప్ర‌స్తుతం క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో మేన‌మామ‌ను క‌నీసం ప‌ల‌క‌రించ‌కుండానే.. జ‌గ‌న్ త‌న మానాన త‌ను ఉన్నార‌ని.. చ‌ర్చ‌న‌డుస్తోంది. ఇది టీడీపీలోనో .. ఇత‌ర పార్టీలోనో.. అయితే.. ప‌ట్టించుకునే ప‌రిస్థితి ఉండేది కాదు. కానీ, ఏకంగా వైసీపీలోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News