కరోనా సెకండ్ వేవ్.. ఇండియాలోనూ మొదలైందా? దేశ రాజధానిలో పెరుగుతున్న కేసులు!
కరోనా సెకండ్‌వేవ్ అమెరికా, యూరోప్ దేశాలను వణికిస్తున్నది. అయితే తాజాగా కరోనా మహమ్మారి మనదేశంలోనూ మొదలైందన్న ప్రచారం ఊపందుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో సెకండ్ వేవ్ వచ్చేస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో గతంలో తగ్గినట్లు కనిపించిన కేసులు.. కొన్ని రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఇటీవల ఢిల్లీలో రోజువారి కేసులు 6వేలను దాటేసాయి. ఢిల్లీలో కేసులు తగ్గాయని ప్రజలంతా ఊపిరితీసుకుంటున్న తరుణంలో పెరుగుతున్న కేసుల సంఖ్య తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ మధ్యకాలంలో రోజువారీ కేసుల సంఖ్య 6000 మార్కును దాటడం ఇదే మొదటిసారి.
తాజాగా 6 వేల 700 కొత్త కేసులు నమోదు కావడంతో ఢిల్లీలో మొత్తం కరోనా సంఖ్య 4 లక్షలను అధిగమించింది. అక్టోబర్ 30 న ఢిల్లీలో ఐదువేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుతున్నాయి. ఈ విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇది సెకండ్ వేవ్ కాదు.. థర్డ్ వేవ్. పండుగ సీజన్, కాలుష్య స్థాయి పెరుగుతుండటంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఢిల్లీ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కరోనా కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటాం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.