`తొలిప్రేమ` రీ-రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు విజయవాడలోని గాంధీనగర్‌లోని కపర్డి థియేటర్ ధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సెకండ్ షో సమయంలో అభిమానులు కొందరు తెరను చించడం..కుర్చీలు పగలగొట్టడం ..సీసీ కెమారాలు ధ్వసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. థియేటర్ సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని కొట్టారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో నాలుగు లక్షలు నష్టం జరిగింది. అటుపై నారాయణపురం పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
తాజాగా ఈ ఘటనపై పోలీసులు పలువురి అభిమానుల్ని అరెస్ట్ చేపారు. అలాగే ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ పట్టుకోవడానికి - సంఘటన వివరాలను తనిఖీ చేయడానికి మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసుల అదుపులో ఉన్న వారిని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి చర్యకు ఎందుకు పూనుకున్నారు? ఇది వాళ్లకు వాళ్లుగానే చేసారా? లేక వెనుక ఎవరైనా ఉన్నారా? ఇందులో ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ చర్యని థియేటర్ యాజమాన్యం రకరకాల కోణాల్లో చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా పవన్ అభిమానులు కావాలనే చేసినట్లు కొత్త బాణి వినిపిస్తున్నారు. ఆ సంగతి పక్కనబెడితే ఇలా పోలీస్ స్టేషన్లకు హాజరవ్వడం పీకే అభిమానులకు కొత్తేం కాదు. గతంలో ఆర్టీసీ బస్సులకు రోడ్డుకు అడ్డుగా వెళ్లి ప్రయాణికులకు ఇబ్బంది కల్గించారు. అలాగే ఆర్టీసీ బస్సు టాప్ ఎక్కి మద్యం మత్తులో హంగామా చేసిన సందర్భాలున్నాయి. అప్పుడు పీకే అభిమానులపై కేసులు పడ్డాయి.
అంతకు ముందు ప్రభాస్- పవన్ అభిమానుల కారణంగా `ఫ్లెక్సీ' వార్ నేపథ్యంలో భీమవరంలో పోలీసులు 144 సెక్షన్ కూడా విధించారు. ఆ సమయంలో 10 మంది పవన్ అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో పోలీసుల వైఖరిని నిరసిస్తూ పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. మరి తాజా ఘటన విషయంలో అభిమానులు ఎలా స్పందిస్తారు? పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.