ఏపీలో జిల్లాల విభజన పట్ల హ్యాపీ అని అన్నారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. తాము అధికారంలోకి వస్తే జిల్లాల సంఖ్య పెరుగుతుందని ఎన్నికలకు ముందే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం హోదాలో జగన్ జిల్లాల సంఖ్యను పెంచడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన ఉంటుందని జగన్ ప్రకటించారు. ఏపీ మొత్తం ఇరవై ఐదు జిల్లాలు అవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు కసరత్తు దాదాపుగా సాగుతున్నట్టే. ఈ అంశం గురించి పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్రం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలుగా మారడం మంచిదే అని పవన్ అన్నారు. తమ పార్టీ బలోపేతానికి కూడా అది ఉపయుక్తం అని పవన్ చెప్పుకొచ్చారు.
త్వరలోనే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా, అదే రకంగా జిల్లాల వారీగా పార్టీ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్టుగా పవన్ ప్రకటించారు. ఇలా జనసేన అధిపతి పార్టీని బలోపేతం చేయబోతున్నట్టుగా చెప్పారు. ఆ అంశానికీ జిల్లాల విభజనకు ముడి పెట్టారు.