ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పటి వరకు ఒకరకంగా.. ముందుకు సాగుతున్న ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా చెప్పులు-మూడు పెళ్లిళ్లు-పొత్తులు.. తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తనను ప్యాకేజీ పవన్ అంటే.. చెప్పుతో కొడతానంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి.
ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో.. విశాఖ పరిణామాలపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. గతంలో వైసీపీ నాయకులు.. తనపై చేసిన విమర్శలకు ప్రతి విమర్శలు చేశారు. ముఖ్యంగా ప్యాకేజీ పవన్ అన్న వారికి చెప్పు చూపించి మరీ.. చెప్పుతో కొడతానన్నారు.
ఇక, వైసీపీ నేతలపై నా.. కొడకల్లా.. ఎదవల్లారా.. అంటూ మండిపడ్డారు. నిజానికి జనసేనాని వ్యవహార శైలిని ఆదినుంచి గమనించిన వారు కూడా..ఈ పరిణామాలతో విస్తు బోయారు. ఆవెంటనే చంద్రబాబు ను కలిసి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే.. తాను.. ఇదిలావుంటే.. వైసీపీ ఈ వ్యాఖ్యలపై చాలానే సీరియస్ అయింది. సీఎం నుంచి మంత్రులు, మాజీ మంత్రుల వరకు అందరూ కౌంటర్లు ఇచ్చారు. సీఎం జగన్ ఏకంగా.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను.. వాళ్లకి.. విడాకులు ఇచ్చి.. సెటిల్ చేసి.. పెళ్లి చేసుకున్నానన్న పవన్ వ్యాఖ్యలను సీఎం జగన్ తీవ్రంగానే మార్చారు.
ఈ వ్యాఖ్యలు.. మహిళల మానాభిమానాలను అవమానించేలా ఉన్నాయని..ఇలా చేసుకుంటూ.. పోతే.. మహిళల ఆత్మగౌరవం ఏంకానని ప్రశ్నించారు. అంతేకాదు.. ఇలా అయితే.. సమాజానికి మనం ఏం సంకేతాలు ఇస్తున్నామని కూడా ప్రశ్నించారు. ఇలాంటి నాయకులను నమ్మొద్దని కూడా.. ప్రకటించారు.ఇ క, దీనినే ప్రజల్లోకి తీసుకువెళ్లేలా.. వైసీపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో జనసేన అంటే.. విరక్తి పుట్టేలా.. ప్రచారం చేసినా.. ఆశ్చర్యం లేదనే సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు.. చెప్పులు చూపించడంపై.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణా కర్ రెడ్డి మరింత ఫైరయ్యారు.
ఆయన తిరుపతిలో.. పాత చెప్పులను గుట్టగా పోసి.. సుమారు 100 మందితో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు.. సీఎంకే చెప్పు చూపిస్తావా.. నీపై హత్యాయత్నం కింద కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని.. అయితే.. మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నువ్వు చూపించిన చెప్పు జాగ్రత్తగా నీదగ్గరే ఉంచుకో.. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ ఘోర పరాజయం తప్పదు కనుక.. ఆ చెప్పుతో నువ్వు.. నిన్ను నాశనం చేస్తున్న చంద్రబాబును కొట్టుకోండి అని వ్యాఖ్యానించారు.
ఇక, మంత్రి బొత్స సత్యనారాయణ వెనక్కి తగ్గేదేలే.. అన్నట్టుగా.. పవన్ ను ప్యాకేజీ పవనే అంటామని చెప్పారు. అంతేకాదు.. నువ్వు 175 సీట్లలో పోటీ చేస్తానని చెప్పేవరకు ఇలానే అంటామన్నారు. ఇలా.. వైసీపీ నాయకులు మూకుమ్మడి దాడితో జనసేనపై విరుచుకుపడ్డారు. అయితే.. ఇంత మంది ఇన్ని అన్నా..కూడా.. జనసేన నుంచి ఇప్పటి వరకు రియాక్షన్ లేదు. మరి దీనిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.