ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) ఢిల్లీ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థి ఆత్మహత్మకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఎయిమ్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న మెడికో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం పక్కనే తీవ్రమైన గాయాలతో పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థులు వెంటనే ఎయిమ్స్ లో ట్రామా సెంటర్ కి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా ఆ విద్యార్థి ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకి తెలిపింది.
పోలీసులు ఈ ఆత్మహత్య పై విచారణ చేస్తున్నారు. అయితే , ఇంకా మెడికో ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఏవో తెలియరాలేదు. అయితే మృతుడు గత కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతుండేవాడని.. ఎయిమ్స్ లోని సైకియాట్రీ విభాగంలో చికిత్స కూడా చేయించుకునే వాడని తెలుస్తోంది. మృతుడు బెంగళూరుకు చెందిన వాడని, అతడు 2018 బ్యాచ్ కు చెందిన వైద్య విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. మెడికో రోజులాగే ఈ రోజు కూడా విధులకు హజరయ్యాడని, సాయంత్రం సమయంలో ఒక గంట సెలవు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విరామం కోసం వెళ్లి సాయంత్రం 6 గంటల సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.