చిన్నారి పెళ్లి కూతురు ఆనంది ఫేం ప్రత్యూహ బెనర్జీ ఆనుమానాస్పద మృతికి సంబంధించి ఇప్పటివరకూ వెల్లడైన విషయాలకు భిన్నంగా మరికొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. తొలుత ఆత్మహత్యగా ఆమె మృతిని భావించినా.. ఆమె సూసైడ్ పై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే.. ఆమె మృతికి కారణంగా భావిస్తున్న ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ కు సంబంధించి చాలానే కోణాలు బయటకు వచ్చాయి. ప్రత్యూషను అతగాడు ఎంతగా హింసకు గురి చేసిందన్న విషయంతో పాటు.. అతడి చేతుల్లో ఆమె ఎన్ని ఇబ్బందులు పడేదన్న విషయం విన్నప్పుడు అయ్యో అనిపించక మానదు.
ప్రత్యూష మృతితో తీవ్ర అనారోగ్యానికి గురైనట్లుగా చెప్పి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాహుల్ ఈ రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని.. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. పోలీసులు జరిపిన విచారణలో బయటపడిన వివరాలు.. ప్రత్యూష తల్లిదండ్రులు ఇచ్చిన సాక్ష్యాన్ని చూస్తే.. టీవీల్లో కనిపించే కష్టాలకు తగ్గట్లే ప్రత్యూష రియల్ లైఫ్ లోనూ చాలానే ఇబ్బందులు పడినట్లుగా అర్థమవుతుంది.
టీవీ నటిగా పేరుప్రఖ్యాతులు వస్తున్న సమయంలో పరిచయం అయిన రాహుల్.. ఆమెకు చాలానే అబద్ధాలు చెప్పాడట. తనకు చాలానే ఆస్తులు ఉన్నాయని.. ముంబయిలో నాలుగు ఫ్లాట్లు.. సొంతూరిలో 150 ఎకరాల భూమితో పాటు.. తన తల్లి ఎమ్మెల్యేగా చెప్పుకునేవాడట. అతనికి గతంలో ఉన్న సంబంధాల కారణంగా తొమ్మిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడట. ప్రత్యూషకు అబద్ధాలు చెప్పటంతో పాటు.. ఆమె జీవితాన్ని పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకున్నాడట. చివరకు తల్లిదండ్రులతోకలిసి ఉంటే ఆమెను వదిలేస్తానని బెదిరించేవాడట.
తరచూ కొట్టటం.. గొడవపడటం లాంటివి జరిగేవని.. ఆమెను కొట్టినప్పుడు బాధతో అరిచే అరుపులు వినిపించేవని చెబుతున్నారు. వీటన్నింటికి తోడు రాహుల్ చేసిన అప్పులు కూడా పెరిగిపోయి.. డబ్బు కోసం ప్రత్యూషను మరింత ఇబ్బంది పెట్టేవాడని చెప్పుకొచ్చారు. విచారణలో భాగంగా తాము సేకరించిన వివరాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం.. దాడి చేయటం.. బెదిరించటం లాంటి అభియోగాలతో అతనిపై కేసు నమోదు చేయటంతోపాటు.. ఆసుపత్రి నుంచి విడుదలైన వెంటనే.. అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.