సినిమా వాళ్ల‌ కు ఎస్వీబీసీ ప‌గ్గాలు రాంగేనా!

Update: 2020-01-13 08:51 GMT
ఇది వ‌ర‌కూ ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కు ఎస్వీబీసీ ప‌గ్గాలు అప్ప‌గించిన‌ప్పుడు ఒక ర‌క‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అప్ప‌టికే వెంక‌టేశ్వ‌రుడి మీద అన్న‌మ‌య్య‌, ఓం న‌మో వెంక‌టేశాయ సినిమాల‌ను తీసిన రాఘ‌వేంద్ర‌రావు కొంత పాజిటివ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. అయితే ఎస్వీబీసీ లో మాత్రం అప్ప‌ట్లో ఒక‌ ర‌క‌మైన లుక‌లుక‌లు సాగాయ‌ని అంటారు. పూర్తిగా రాఘ‌వేంద్ర‌రావు టీమ్ ఎస్వీబీసీ ప్రోగ్రామ్స్ అన్నింటిని నిర్దేశించింద‌ని అంటారు. బ‌య‌టి వాళ్ల‌కు చిన్న అవ‌కాశం ఇవ్వ‌కుండా వాళ్లు అంతా తామై న‌డిపించార‌నే అభియోగాలు వినిపించాయి.

ఇక తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డంతో రాఘ‌వేంద్ర‌రావు ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. అవ‌కాశం అనూహ్యంగా పృథ్వీకి ద‌క్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టు గా పృథ్వీ కి ఆ అవ‌కాశం ద‌క్కింది. అయితే వెనువెంట‌నే ఆయ‌న ఆ అవ‌కాశాన్ని దుర్వినియోగం చేసుకున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. కాస్టింగ్ కోచ్ త‌ర‌హా వ్య‌వ‌హారంలో ఆయ‌న చిక్కుకుని రాజీనామా చేసి త‌ప్పుకున్నారు. ఇంత‌కు మించి లాగితే వ్య‌వ‌హారం మ‌రింత చెడుతుంద‌ని పృథ్వీ తెలివి గా త‌ప్పుకున్నాడు.


రాఘ‌వేంద్ర‌రావు అని కాదు, పృథ్వీ అని కాదు.. అస‌లు సినిమా వాళ్ల‌కే ఈ ఎస్వీబీసీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం రాంగా.. అనే సందేహాలు జ‌నిస్తూ ఉన్నాయిప్పుడు. సినిమా వాళ్ల ట్రాక్ రికార్డులు ఏవీ అంతా గొప్ప‌గా ఉండ‌వు. పై స్థాయి లో ఉన్న సినిమా వాళ్ల విష‌యంలో అయితే ర‌క‌ర‌కాలు రూమ‌ర్లు ప్ర‌చారంలోనే ఉంటాయి. వాళ్ల‌కు ప‌డ‌ని వాళ్లు బోలెడంత మంది ఉంటారు. అదంతా వ్య‌క్తి గ‌త‌మైన వ్య‌వ‌హారం అయి ఉండొచ్చు. కానీ.. దేవాల‌యానికి సంబంధించిన టీవీ వ్య‌వ‌హారాల్లో అలాంటి వారి తీరు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తుంది.

వారు తీసిన సినిమాలు, చేసిన పాత్ర‌లు.. ఇలాంట‌వ‌న్నీ కూడా ఆ సంద‌ర్భంగా చ‌ర్చ‌నీయాంశం అవుతూ ఉంటాయి. ఇలాంటి నేప‌థ్యంలో ఎస్వీబీసీకి సినిమాయేత‌ర వ్య‌క్తుల‌ను చైర్మ‌న్ గా నియ‌మిస్తే ఏ గొడ‌వా ఉండ‌ద‌నే అభిప్రాయాలు ప‌రిశీల‌కుల నుంచి వినిపిస్తున్నాయి. సినిమా వాళ్లే టీవీ చాన‌ల్ ను ఉద్ధ‌రిస్తార‌ని చెప్ప‌డానికి ఏమీ లేదు. ఇలాంటి నేప‌థ్యంలో ఎస్వీబీసీ చైర్మ‌న్ గా కాస్త భ‌క్తిప్ర‌వ‌త్తులు ఉన్న వారిని నియ‌మిస్తే మంచిద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News