ఇష్టారాజ్యంగా మాట్లాడితే తిప్పలు తప్పవన్న విషయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. ఆ పార్టీ యువరాజుగా కీర్తించే రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. గతంలో ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యపై సారీ చెప్పాలంటూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయటం ఆయనకు చేదు అనుభవంగా చెప్పాలి. మహాత్మా గాంధీని ఆర్ ఎస్ ఎస్ చంపిందంటూ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.
ఒక సంస్థపై అంత పెద్ద నిందను ఎలా మోపగలరు? అంటూ ప్రశ్నించటమే కాదు.. ఆ వ్యాఖ్యల్ని ఎలా సమర్థించుకుంటారని. ఈ ఉదంతంలో తప్పనిసరిగా హాజరు కావటమే కాదు.. వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకోసం ఈ నెల 27 వరకూ టైమిచ్చింది. జాతిపిత గాంధీని ఆర్ ఎస్ ఎస్ హత్య చేసిందన్న ఆరోపణ రాహుల్ చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ అంశాన్ని ఆర్ ఎస్ ఎస్ తీవ్రంగా ఖండించింది.
ఈ వ్యాఖ్యను తప్పు పడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సుప్రీంకోర్టులో పరువునష్టం దావా వేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానిస్తూ.. ‘‘మీరేం మాట్లాడుతున్నారో.. అది ప్రజలకు మంచిదా? లేదా? అనే విషయాన్ని ఆలోచించాలి. ఒక సంస్థపై ఇలాంటి నిందలు వేయలేరు. మీరు చేసిన వ్యాఖ్యతో ఆ సంస్థలో ఉన్న అందరిని తప్పు పట్టినట్లైంది’’ అని సుప్రీం ఘాటుగా మండిపడింది. ఈ సందర్భంగా రాహుల్ తరఫు న్యాయవాదులు ఆయన చేసిన వ్యాఖ్యల్ని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. రాహుల్ వ్యాఖ్యల్లో నిజం ఎంతో.. ప్రజలకు మంచి చేసే విషయం ఏమిటో నిరూపించుకోవాలని కోర్టు స్పష్టం చేయటం గమనార్హం. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని.. లేనిపక్షంలో ఆయన కేసు ఎదుర్కోవాల్సిఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. మరీ.. ఇబ్బందికర పరిస్థితిని రాహుల్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.