లాస్ట్ బాల్ వరకు బ్యాటింగ్ చేస్తానని రాష్ట్ర విభజనను చివరి వరకు అడ్డుకున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరినా ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఏపీ కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఏపీలో చచ్చుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్జీవం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ సీనియర్లను తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఆ క్రమంలోనే గత నాలుగేళ్లుగా మౌనవత్రం పట్టిన కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పారు. ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా.. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలపై బాగా పట్టున్న నేత కావడంతో ఈయన నుంచి కాంగ్రెస్ అధిష్టానం చాలా ఆశించింది. ఏపీలో కాంగ్రెస్ క్యాడర్ ను ఈయన గాడిలో పెడతారని భావించిందట.. కానీ ఏం చేయలేని స్థితిలో నల్లారి వెళ్లిపోయాడని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణను చివరి వరకు అడ్డుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందిన కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఎన్నికలకు దూరంగా పెట్టింది. తెలంగాణ విషయాన్ని పక్కనపెడితే ఆంధ్రా పాలిటిక్స్ లోనూ ఆయన యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం టీడీపీతో కాంగ్రెస్ చేస్తున్న దోస్తీయే కారణమని కాంగ్రెస్ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ తో సై అంది టీడీపీ. ఏపీలో కోమాలో ఉన్న కాంగ్రెస్ కు టీడీపీ పొత్తు అనేది అనివార్యంగా మారింది. దానికి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు సంబరాలు చేసుకోవాలి. కానీ అనాధిగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబుతో తనకు ఉన్న వైరం కారణంగానే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉండిపోతున్నారట..
చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు - కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య వైరం ఈనాటిది కాదు.. జిల్లాలో తొలి నుంచి చంద్రబాబును ఎదురిస్తూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు టీడీపీతో కాంగ్రెస్ దోస్తీని హర్షించలేకపోతున్నారట.. ఈ కారణంగానే ఆయన యాక్టివ్ గా లేరట.. అదే సమయంలో కిరణ్ చేరికతో సీమలో పార్టీ బలపడుతుందని హైకమాండ్ భావించింది. కానీ ఆ దిశగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు.
2014లో జైసమైఖ్యాంధ్ర పార్టీ పెట్టి ఘోరంగా ఓడిన నల్లారి ఆ తర్వాత కామ్ అయిపోయారు. ఆయన పార్టీ నుంచి పోటీచేసిన వారంతా టీడీపీ - వైసీపీ పార్టీల్లో చేరిపోయారు. చివరకు ఆయన సొంత తమ్ముడు నల్లారి కిషోర్ కూడా సైకిలెక్కారు. అటు ప్రధాన అనుచరులు చేజారిపోయారు. అందుకే ప్రస్తుతం టీడీపీ - కాంగ్రెస్ బంధం కొనసాగుతున్నా.. అనాదిగా వైరం కారణంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు రావడం లేదు. ఇలా అనేక కారణాల వల్ల కాంగ్రెస్ లో ఉన్నానంటే ఉన్నానన్నట్లు ఉండిపోయారట నల్లారి. మరి మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికల సమరం మొదలుకాబోతోంది. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి మున్ముందు ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగానే ఉందంటున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.