ఎంట్రీతోనే కేసీఆర్ కు కిషన్ రెడ్డికి లింకు పెట్టేశాడుగా?

Update: 2021-06-27 09:30 GMT
ఎన్నాళ్లుగానో వేచి చూసిన రోజు రానే వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి అప్పగిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ పడినప్పటికీ.. తీవ్రమైన తర్జనభర్జనల నడుమ రేవంత్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. తనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన అనంతరం.. కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

గడిచిన కొద్దిరోజులుగా కామ్ గా ఉన్న ఆయన.. టీ పీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినట్లు సమాచారం అందినంతనే ముగ్గురు కీలక నేతలకు ముడి వేస్తూ..కామెంట్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బీజేపీలోకి పంపింది ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. మరో కీలక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై కొత్త అనుమానాలు రేకెత్తేలా వ్యాఖ్యలు చేశారు.

ఈటల రాజేందర్ ను బీజేపీలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించినట్లు చెబుతున్న కిషన్ రెడ్డి.. రాత్రికి రాత్రి హైదరాబాద్ కు వచ్చిన చార్టర్డ్ ఫ్లైట్ ఒక కాంట్రాక్టరుదని ఆయన కొత్త బాంబ్ ను పేల్చారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి రావడానికి  కాంట్రాక్టర్ చెందిన చార్టర్డ్ ఫ్లైట్ ఎందుకు వాడినట్లు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు ఆరోపణల మరక వేయటమే కానీ.. మీద పడని కిషన్ రెడ్డి రేవంత్ ఆరోపణలకు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News