బాబు డర్టీ, లోకేష్, దేవాన్స్ పెట్టీ.. రోజా పంచుల వర్షం

Update: 2020-01-21 07:42 GMT
అసెంబ్లీ సమావేశాల రెండోరోజు మైక్ నందుకున్న ఫైర్ బ్రాండ్ , వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు లోకేష్, మనవడు దేవాన్ష్ ను కూడా ఇరికించి తన ప్రసంగంతో చెడుగుడు ఆడేశారు. చంద్రబాబు తీరును ఎండగట్టారు.

ఏపీ అసెంబ్లీలో రెండోరోజు ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతి గురించి గొప్పగా మాట్లాడారని చంద్రబాబు చెప్పుకోవడంపై ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు. ‘ఇదే సీఎం కేసీఆర్.. చంద్రబాబు వంటి డర్టియెస్ట్ పొలిటీషియన్ దేశ చరిత్రలోనే లేడన్న విషయం’ మరిచిపోయారా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, కేసీఆర్ లు ఇచ్చిన మట్టి నీరుతో అమరావతిలో కనీసం శాశ్వత భవనాలను చంద్రబాబు ఎందుకు నిర్మించలేదని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు వైఫల్యం వల్లే అమరావతి మారిందన్నారు. అమరావతి పేరుతో ఒక సామాజికవర్గానికే న్యాయం చేసేలా చంద్రబాబు కుట్ర పన్నారని విమర్శించారు.

రాయలసీమకు బుల్లెట్ రైలు తెస్తానన్న చంద్రబాబు ఎందుకు తేలేదని.. ఆ ట్రైన్లో లోకేష్ ఆడుకుంటున్నారా అని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. రెయిన్ గన్ లతో రాయలసీమ కరువును జయించామన్న చంద్రబాబు.. ఆ రెయిన్ గన్ లు ఏమయ్యాయని.. వాటితో దేవాన్ష్ ఆడుకుంటున్నాడా అని విమర్శించారు.

అమరావతి రైతుల నుంచి 4వేల ఎకరాలు భూమిని దోచుకొని చంద్రబాబు వారిని షేవ్ చేశారని.. ఇంకా ఏం సేవ్ చేయాలని రోజా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో సేవ్ అమరావతి అంటూ నినదిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ మహిళ ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ నేతల తీరును కడిగేశారు. మహిళల పై గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
Tags:    

Similar News