తమిళనాడు ఇంచార్జీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భేటీ ముగిసింది. గవర్నర్ తో సమావేశం సందర్భంగా తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వడం, అన్నాడీఎంకే శ్రేణులు తననే సీఎం కావాలని కోరుకున్న విషయం, పన్నీర్ సెల్వం మాట మార్చిన తీరు శశికళ వివరించినట్లు సమాచారం. సుమారు 20 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే చిన్నమ్మ పోయెస్ గార్డెన్‌కు వెళ్లిపోయారు. అయితే ఆమె ముఖంలో కొద్దిపాటు నవ్వుతో పాటు టెన్షన్, నిరాశ కనిపించింది. దీన్ని బట్టి గవర్నర్ తో శశికళ భేటీ సానుకూల దోరణిలో జరగలేదని భావిస్తున్నారు.
మరోవైపు అక్రమాస్తుల కేసులో శశికళ పాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కూడా భాగస్వామిగా ఉన్న కేసులో సుప్రీంకోర్టు రేపు(శుక్రవారం) తీర్పు వెలువరిస్తుందని అందరూ భావించారు. ఈ తీర్పు ప్రతికూలంగా వస్తే.. శశికళకు సీఎం పదవి చేపట్టే చాన్స్ ఉండదని అంచానాలు వెలువడ్డాయి. అయితే, సుప్రీంకోర్టు శుక్రవారం లిస్టింగ్‌లో ఈ కేసు నమోదుకాలేదు. దీంతో ఈ కేసులో వచ్చేవారం తీర్పు వెలువడే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు రాజ్‌భవన్‌లో ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావుతో ఆ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాజీనామాకు దారి తీసిన పరిస్థితులపై పన్నీర్ చర్చించారు. గవర్నర్ తో భేటీ ముగిసిన అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలిపారు. సత్యమేవ జయతే.. న్యాయం గెలుస్తుందన్నారు. అమ్మ(జయలలిత) ఆశీస్సులతో తమిళనాడుకు అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను గవర్నర్‌కు వివరించారు. బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు సెల్వం తెలిపారు. తనపై ఒత్తిడి కారణంగానే సీఎం పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందన్నారు. అమ్మ ఆశీర్వాదం ఉన్నంత వరకు తనకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు.