లాక్ డౌన్: పోలీస్ దెబ్బలకు యువకుడి మృతి?

Update: 2020-04-20 12:56 GMT
ఏపీలోని గుంటూరులో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అక్కడ కేసుల సంఖ్య పెరగడంతో రెడ్ జోన్ గా ప్రకటించి పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నారు. అయితే లాక్ డౌన్ ఉల్లంఘించాడని ఓ యువకుడిని పోలీసులు కొట్టినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ దాడిలో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోవడంతో బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులే చంపారని ఆరోపిస్తున్నారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ దారుణం జరిగింది. సత్తెనపల్లి చెక్ పోస్టు మీదుగా మెడికల్ షాప్ నకు మందుల కోసం వెళుతున్న మహ్మద్ గౌస్ అనే యువకుడిని పోలీసులు ఆపినట్టు సమాచారం. ఈ రెడ్ జోన్ నుంచి ఎందుకొస్తున్నావంటూ కొట్టారంటున్నారు. పోలీసుల దెబ్బలకు తాళలేక అక్కడే గౌస్ కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడట.. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడని వార్తలు వచ్చాయి.

గౌస్ మృతికి పోలీసుల దెబ్బలే కారణమని బంధువులు - స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీస్ ఉన్నతాధికారులు ఘటనకు బాధ్యుడైన ఎస్ఐ రమేష్ ను సస్పెండ్ చేశారు. విచారణ జరుపుతున్నామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఐజీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. రెడ్ జోన్ లో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా రావడంతోనే గౌస్ ను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు.

    

Tags:    

Similar News