వైఎస్ త‌ల్లిని.. జ‌గ‌న్‌.. భార్య‌ని.. బాబుకు ఏంటీ దుస్థితి...!

Update: 2021-11-20 13:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వ‌రుస దెబ్బ‌లు. అది కూడా ఒకే కుటుంబం నుంచి తీవ్ర అవ‌మానాలు. ఎందుకు ఇలా జ‌రుగుతోంది. ఏంటి ? అస‌లు దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఇప్పుడు రాజ‌కీయ నేత‌ల మ‌ద్య జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే. గ‌తంలో వైఎస్ 2004లో తొలిసారి ముఖ్య‌మంత్రి పీఠంపైకి ఎక్కిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ను అసెంబ్లీలో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే.. `నువ్వు నీ త‌ల్లిక‌డుపున ఎందుకు పుట్టావా? అని ఏడ్చేరోజు వ‌స్తుంది చంద్ర‌బాబు` అంటూ.. చంద్ర‌బాబు త‌ల్లిని తీవ్ర‌స్థాయిలో అవ‌మానించారు.

అంతేకాదు.. నాకు ఈ ప‌ద‌వి మీనాన్న‌గారు ఇవ్వ‌లేదు.. అంటూ.. ప‌రోక్షంగా చంద్ర‌బాబు తండ్రిని కూడా వైఎస్‌ దూషించారు. ఇక‌, ఇప్పుడు వైఎస్ త‌న‌యుడు, వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో మ‌రోసారి.. చంద్ర‌బాబుకు.. అదే అసెంబ్లీ వేదిక‌గా.. తీవ్ర అవ‌మానం జ‌రిగింది. ఏకంగా..చంద్ర‌బాబు స‌తీమ‌ణిని మంత్రి కొడాలి నాని.. ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు దూషించార‌ని..టీడీపీ నేత‌లు చెబుతున్నారు. దీంతో చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయి లో హ‌ర్ట్ అయ్యారు. క‌న్నీరు పెట్టుకున్నారు. ఇక‌, ఈ స‌భ‌లో అడుగు పెట్టేది లేద‌ని.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తిరిగి తాను ముఖ్య‌మంత్రి అయ్యాకే అడుగు పెడ‌తాన‌ని శ‌ప‌థం చేశారు.

అయితే.. చంద్ర‌బాబుకే ఈ స‌మ‌స్య ఎందుకు వ‌స్తోంది. ఆయ‌నే ఎందుకు అప్ప‌ట్లో దివంగ‌త వైఎస్ నుంచి ఇప్ప‌టి జ‌గ‌న్ వ‌ర‌కు కూడా ఆయ‌న తీవ్ర అవ‌మానాలు ఎదుర్కొన్నారు. అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారిం ది. ఈ నేప‌థ్యంలో అస‌లు చంద్ర‌బాబు ఇమేజ్‌ను టార్గెట్ చేస్తున్నారా?  లేక‌.. చంద్ర‌బాబు చ‌రిష్మాను టార్గెట్ చేస్తున్నారా?  లేక‌..టీడీపీని లేకుండానే చేయాల‌నే ఉద్దేశంతో ఆయ‌న‌ను టార్గెట్ చేస్తున్నారా? అనేది చర్చ‌కు దారితీసింది.

అయితే.. చంద్ర‌బాబు.. బాయ్‌కాట్ చేసినా.. ఎమ్మెల్యేలుగానే కొన‌సాగుతారా?   లేక‌.. మ‌ధ్య‌లోనే రాజీనామా చేస్తారా? మ‌ళ్లీ టీడీపీ నేత‌లంతా కూడా ఎన్నిక‌ల‌కు వెళ్తారా?  అనేది చూడాలి. ఏదేమైనా.. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలో ఒకే కుటుంబం నుంచి అది కూడా తండ్రీ కొడుకుల నుంచి అసెంబ్లీలోనే అవ‌మానానికి గురికావడం వంటివి ఆయ‌న స్థాయికి పెద్ద ఎదురు దెబ్బే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.
Tags:    

Similar News