కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బ్రాంకైటిస్ కారణంగా ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. 76 ఏళ్ల సోనియా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న ఆసుపత్రిలో సోనియా చేరినట్లు ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు.
జ్వరం కారణంగానే సోనియాకు అనారోగ్యం వచ్చిందని తెలిపారు. ఛాతీ వైద్యవిభాగం సీనియర్ కన్సల్టెంట్ అరుప్ బసు, అతని బృందం పర్యవేక్షణలో సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరినట్లు సర్ గంగా రామ్ హాస్పిటల్ ట్రస్ట్ సొసైటీ ఛైర్మన్ డిఎస్ రాణా తెలిపారు. సోనియా గాంధీ అబ్జర్వేషన్‌లో ఉన్నారని, ఆమె ఆరోగ్యంపై చికిత్స చేస్తున్నట్టు ఆసుపత్రి తెలిపింది.
సోనియా గాంధీని వైద్యులు పరిశీలనలో ఉంచారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఆమె ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. జనవరిలో సోనియా గాంధీ వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో చికిత్స కోసం ఢిల్లీ ఆసుపత్రిలో చేరారు.
ఆమె ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ రాజకీయాల నుండి తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు."భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగిసిందని.. ఇక రాహుల్ దే బాధ్యత " అని సంతోషంగా ఉన్నట్టు తెలిపింది.
సెషన్ మొదటి రోజు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ పార్టీ అత్యున్నత మండలి, వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించకూడదని నిర్ణయించింది. దాని సభ్యులను నామినేట్ చేయడానికి కొత్త పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అధికారం ఇచ్చింది.
ఎన్నికల పరాజయాలు, అధికారం కోసం ఏళ్ల తరబడి అంతర్గత తగాదాలు.. నాయకుల వలసల తర్వాత, సోనియా గాంధీ అక్టోబర్‌లో 137 ఏళ్ల కాంగ్రెస్ అధ్యక్ష పదవిని విధేయుడైన ఖర్గేకు అప్పగించారు. పార్టీ యొక్క మొదటి కుటుంబంగా పరిగణించబడుతున్న గాంధీలు ఇప్పటికీ కాంగ్రెస్ పై గట్టి పట్టును కొనసాగిస్తున్నారు.