తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై ఇటీవలి కాలంలో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ పార్టీ మరో కొత్త అంశంతో విరుచుకుపడింది. ఈ దఫా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడైన మంత్రి కేటీఆర్ పై కాకుండా...ఆయన తన అయిన ఎంపీ కవితపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు - ఎంపీ సుష్మితా దేవ్ తాజాగా ఈ వాగ్భాణాలు సంధించారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో పాల్గొంటూ ఎంపీ కవితకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బిడ్డను ఒకలాగా..తెలంగాణ ఆడబిడ్డలను మరోలాగా చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు - ఎంపీ సుష్మితా దేవ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు 30 రూపాయల చీరలు ఇస్తోందని....కానీ కేసీఆర్ కూతురు కవిత మాత్రం పార్లమెంటుకు లక్షలలో విలువ చేసే చీరలు కట్టుకుంటుందని ఆమె తెలిపారు. `నేను పార్లమెంటు సమావేశాల్లో రోజూ ఎంపీ కవితను చూస్తాను. ఆమె కట్టే చీరల విలువ లక్షల్లో ఉంటుంది`అని అన్నారు. కేసీఆర్ తన కూతురు కవితను వలే రాష్ట్ర మహిళల సంక్షేమాన్ని చూడాలని కోరారు. మహిళలంతా ఒక్కటైతే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపైనే తాము యుద్ధం చేస్తున్నామని...ఇక్కడ కేసీఆర్ ఎంత అని వ్యాఖ్యానించారు.
రాజకీయాలలో ఉన్న సమయంలో ప్రజాప్రతినిధిగా ఉండటం వల్ల మాత్రమే సమస్యలను పరిష్కరించవచ్చు అనేది తప్పు అని ఎంపీ అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో ఉంది కూడా సమస్యలు పరిష్కరించవచ్చని తెలిపారు. మాటలు తక్కువ మాట్లాడాలి, పని ఎక్కువ చేయాలి అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్తుంటారని... కానీ దేశం లో మాటలు ఎక్కువ పని తక్కువ జరుగుతుందని ఎద్దేవా చేశారు. న్యూస్ పేపర్లలో న్యూస్ కంటే తక్కువగా మోడీజీ ప్రకటనలు ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ బూత్ లెవల్ పార్టీ కార్యకర్తలతో సమావేశం పెట్టి మాట్లాడతారని ఇలా ఒక్క కాంగ్రెస్ లోనే జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
మహిళ నాయకులంతా కాంగ్రెసును ఎలా బలపరచాలి అని ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు తెలిపారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశ పెట్టలేకపోతుందని ఆమె తప్పుపట్టారు. జిల్లా మహిళ అధ్యక్ష్యురాళ్లు తమ తమ ప్రాంతాల్లో పోరాటం చేయాలని సూచించారు. కేవలం బహిరంగ సభలతోనే కాకుండా...చిన్న చిన్న సమూహాల ద్వారా కూడా చైతన్యపరచవచ్చని వివరించారు.