కేసీయార్ ని సాహసి అన్న మాటతో పొగిడితే అంటే సరిపోదు. ఆయనను దుస్సాహసి అనాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నేర్పు ఓర్పు ఉన్న వారుగా కేసీయార్ ఇప్పటికే చరిత్రకు ఎక్కారు. లేకపోతే ఢక్కామెక్కీలు తిన్న మర్రి చెన్నారెడ్డి సహా తెలంగాణా ఉద్ధండుల వల్ల కానీ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఒక బక్క ప్రాణి కేసీయార్ సాధించారు అంటే అది సూపర్ డూపర్ గ్రేటే కదా. ఒక విధంగా ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం కేసీయార్ టీయారెస్ పార్టీ పెట్టి ప్రత్యేక తెలంగాణా అన్న కొండను ఢీ కొట్టారు. నాడు ఆయన బలాన్ని, ఆయన వెనక ఉన్న వనరులను చూసిన వారు కచ్చితంగా దుస్సాహసమే అనుకున్నారు. కానీ దశాబ్దన్నర తరువాత అదే కేసీయార్ తెలంగాణా సాధించి చూపించారు.
సరే తెలంగాణా సెంటిమెంట్ ఎపుడూ ఉంది. దాన్ని రాజేసి కేసీయార్ లక్ష్యం చేరుకున్నారు. దానికి నాడు దేశంలో ఉన్న సంకీర్ణ రాజకీయాల పరిస్థితులు సహకరించాయి. కేసీయార్ వ్యూహాలు కూడా ఉపకరించాయి. సమైక్యవాదుల అనైక్యత, వ్యూహాల లేమి వంటివి కూడా తెలంగాణా రాష్ట్ర సాధనకు ఇండైరెక్ట్ గా ఉపయోగపడ్డాయని చెప్పాలి.
కానీ ఇపుడు కేసీయార్ భారత రాష్ట్ర సమితి అంటున్నారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో తెలంగాణా ఒకటి, కేవలం 17 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్న చిన్న రాష్ట్రం. నంబర్ గే, లో ఏ కోశానా ఎవరికీ పెద్దగా పట్టని రాష్ట్రం. అలాంటి రాష్ట్రం నుంచి వచ్చి ఒక జాతీయ పార్టీని స్థాపిస్తాను అని కేసీయార్ అంటున్నారు అంటే అది దుస్సాసహంగానే చూడాలి. ఒక విధంగా కొండకు వెంట్రుకను కట్టి లాగే ప్రయత్నంగానూ అనుకోవాలి.
ఉమ్మడి ఏపీలో 42 ఎంపీ సీట్లు ఉంటే నాడు ఎన్టీయార్ వంటి చరిష్మాటిక్ లీడర్ భారతదేశం పార్టీ పెట్టాలని ఆలోచించి కూడా అక్కడే ఆగిపోయారు. నాడు సౌత్ లో పెద్ద నంబర్ గా ఏపీ ఉండేది. ఎన్నో సార్లు జాతీయ రాజకీయ యవనిక మీద ఉమ్మడి ఏపీ కీలకం అయింది. అలాంటి రోజులలోనే భారతదేశం పార్టీ అన్న రాజకీయం నడవలేదు.
మరి 17 సీట్లున్న కేసీయార్ భారత రాష్ట్ర సమితి అంటే వర్కౌట్ అవుతుందా. ఇది చాలా పెద్ద ప్రశ్న. సమాధానం కూడా సులువే. కానీ అక్కడ ఉన్నది కేసీయార్. కాబట్టి కాస్తా ఆలోచించాలి. ముందే చెప్పుకున్నట్లుగా ఆయన దుస్సాహసి. పైగా రాజకీయ అదృష్టవంతుడు మాత్రమే కాదు, వ్యూహాలు నిండుగా మెండుగా ఉన్న వారు. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్న ఆలోచనలతో బీయారెస్ అన్న మంత్రాన్ని కేసీయార్ జపిస్తున్నారా అన్నది చూడాలి.
ఇక బీయారెస్ ఆవశ్యకత గురించి కేసీయార్ తన పార్టీ వారితో మాట్లాడుతూ అన్న మాటలు ఆసక్తికరంగానే ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పెద్దగా లేదని ఆయన అన్నారని వార్తలు వచ్చాయి. నిజంగా కాంగ్రెస్ దేశంలో లేదా అంటే ఎందుకు లేదు, అన్ని చోట్లా ఉంది. అయితే నాయకత్వ సమస్యలతో ఉంది. దాన్ని సరిచేసుకుంటే కాంగ్రెస్ ఫిలాసఫీ తో మళ్లీ పుంజుకుంటుంది. మరి బీయారెస్ ఆవిర్భావానికి దేశంలో బీజేపీకి ఆల్టర్నేషన్ పార్టీ లేదన్న ఒక్క అంశాన్నే కేసీయార్ చూస్తున్నారు.
కానీ ఉత్తరాది పెత్తనం ఎక్కువగా నడిచే దేశ రాజకీయాల్లో సౌత్ నుంచి అందునా నంబర్ గేమ్ లో పెద్దగా పట్టని తెలంగాణా నుంచి బీయారెస్ అంటూ కేసీయార్ రంగంలోకి దిగితే పొలిటికల్ సీన్ ఎలా ఉంటుంది అన్నదే ఆలోచించాలి. ఏమైనా కేసీయార్ చేస్తున్నది అతి పెద దుస్సాహసం గానే పేర్కొనాలి. దానికి గానూ ఆయన్ని శభాష్ అని కూడా అనాలి.