కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మోటార్ చట్టం నుంచి ఎవరూ తప్పించుకోవడం లేదు. ఏకంగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఇందులో బుక్కైపోతున్నారు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో కఠినంగా ఉంటున్న పోలీసులు భారీ జరిమానాలు విధిస్తూ బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సాధారణ ప్రజలను వదలని పోలీసులు ఇప్పుడు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా వదలకుండా షాక్ ఇవ్వడం చర్చనీయాంశమైంది..
తాజాగా మంత్రులు - ఎమ్మెల్యేలకు చెందిన వాహనాలు అధికవేగంతో వెళ్తుండడాన్ని సీసీటీవీల ద్వారా గుర్తించిన పోలీసులు ఏమాత్రం సంకోచించకుండా వారికి ఆన్ లైన్ ద్వారా చలాన్లు పంపడం విశేషం.
మంత్రుల ప్రయాణాలకు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన స్పీడు గంటకు 100 కి.మీలు. కానీ ఆ స్పీడును మించి వెళ్లినందుకు తాజాగా వారికి జరిమానా పడింది.
తాజాగా మంత్రుల కార్లు 100 కి.మీల వేగాన్ని మించి స్పీడ్ గన్ లకు చిక్కాయి. దీంతో అధికారులు మంత్రులు హరీష్ రావు - ఈటల - గంగుల కమలాకర్ - కొప్పులు ఈశ్వర్ లకు జరిమానాలు పంపినట్టు తెలిసింది. తెలంగాణ మంత్రులకు కూడా జరిమానా వేసిన పోలీసుల తీరుపై వాళ్లు ఎలా స్పందిస్తారు? రూల్స్ అందరికీ ఒకేటే అంటారా అన్నది వేచిచూడాలి.