ఉపాధి నిమిత్తం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి అక్కడే దాదాపుగా స్థిరపడిపోయిన ఓ తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ పొట్టనబెట్టేసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ దేశంలో ఉంటున్న ఇతర దేశాలకు చెందిన వృత్తి నిపుణులు దినదినగండంగానే బ్రతుకు వెళ్లదీస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. అక్రమ వలసదారులను తిప్పి పంపేస్తామని ట్రంప్ చేసిన సంచలన ప్రకటన నేపథ్యంలో అన్ని అనుమతులతో అమెరికాలో అడుగుపెట్టి వృత్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరిన ఎన్నారైలు... ప్రత్యేకించి తెలుగు నేలకు చెందిన నిపుణులు నానా ఇబ్బందులు పడుతున్న వైనం కూడా మనకు తెలిసిందే. ఆ క్రమంలోనే ఇప్పటికే ఏళ్ల తరబడి అమెరికాలోనే ఉంటూ... అమెరికన్ గా గుర్తింపు సంపాదించేందకు అన్ని అర్హతలు పొందిన తెలుగు నేలకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శివ చలపతి రాజు... అసలు తనకు, తనను నమ్ముకుని అమెరికా వచ్చేసిన తన కుటుంబానికి గ్రీన్ కార్డు దక్కుతుందో? లేదోనన్న బెంగతో ఏకంగా ప్రాణాలు వదిలేశారు.
అమెరికాలోని ఇతర దేశాలకు చెందిన వారికి... ప్రత్యేకించి అక్కడి మనోళ్లను తీవ్రంగా కలచివేస్తున్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... తెలుగు నేలకు చెందిన శివ చలపతి రాజు చాన్నాళ్ల క్రితమే ఉపాధి నిమిత్తం అమెరికా వెళ్లారు. తొలుత విప్రో, బ్రిటిష్ పెట్రోలియం సంస్థల్లో మిషిగాన్, ఇల్లినాయిస్ లలో పనిచేసి ప్రస్తుతం ఒరాకిల్ లో పనిచేస్తున్నారు. ఒరాకిల్ లో డెవలపర్ గా ఉన్నత స్థానంలో పనిచేసే అవకాశం దక్కడంతో రాజు ఫ్యామిలీ ప్రస్తుతం నార్త్ కరోలినాలో నివాసం ఉంటోంది. రాజుతో పాటు ఆయన సతీమణి బాబీ సౌజన్య కూడా అక్కడే ఉంటున్నారు. గ్రీన్ కార్డ్ దక్కించుకునేందుకు అన్ని అర్హతలు లభించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అవలంబిస్తున్న అపసవ్య విధానాలతో రాజు ఫ్యామిలీ గత కొంతకాలంగా తీవ్ర మనోవేదనలో మునిగిపోయింది. ఈ వేదన కారణంగానే రాజు గురువారం మరణించినట్టు అక్కడి వార్తా సంస్థ ద అమెరికన్ బజార్ తెలిపింది. అంతేకాకుండా గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ వేదనతోనే రాజు ప్రాణాలు వదిలినట్లుగా కూడా ఆ పత్రిక రాసుకొచ్చింది.
రాజు అకప్మాత్తుగా మరణించిన నేపథ్యంలో ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన ఆయన సతీమణి సౌజన్య ఇప్పుడు ఉన్నపళంగా భారత్ కు తిరిగి రాక తప్పని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఊహించని ఈ పరిణామంతో రాజు ఫ్యామిలీ తీవ్ర వేదనలో కూరుకుపోగా... రాజు మృతదేహాన్ని భారత్ కు తరలించడం ఆ కుటుంబానికి దుస్సాధ్యంగానే మారిపోయింది. రాజు ఫ్యామిలీ పరిస్థితిని గ్రహించిన పీడ్ మాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్ (పాటా)... రాజు ఫ్యామిలీకి అండగా నిలిచేందుకు రంగంలోకి దిగిపోయింది. రాజు అంత్యక్రియలకు అవసరమైన నిధులను సమీకరించేందుకు నడుం బిగించింది. రాజు అంత్యక్రియలకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలని పాటా చేసిన వినతికి భారీగానే స్పందన వచ్చినట్టుగా సమారాచం. అవరసరమైన మేర నిధులు సమకూరిన మరుక్షణమే రాజు మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు పాటా అన్ని ఏర్పాట్లూ చేస్తోంది.
ఇదిలా ఉంటే... రాజు ఆకస్మిక మరణం అక్కడి మన తెలుగోళ్లను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసిందని చెప్పాలి. గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ కు మద్దతిస్తూ... ట్రంప్ సర్కారుకు మద్దతు పలికిన ఇల్లినాయిస్ సెనేటర్ డిక్ డర్బిన్ పై మన తెలుగు నిపుణులు సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. #డర్బిన్ విడో - #డర్బిన్ ఓర్ఫాన్ హ్యాష్ ట్యాగ్ లతో ట్విట్టర్ వేదికగా అక్కడి మనోళ్లు డిక్ డర్బిన్ వైఖరిని ఏకిపారేస్తున్నారు. అంతేకాకుండా గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ ద్వారా నానా యాతనలు పడుతున్న ప్రవాస భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వృత్తి నిపుణులకు అండగా నిలిచే విషయంపైనా ఇప్పుడు అక్కడ పెద్ద చర్చే జరుగుతోంది. అంతేకాకుండా గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ కారణంగా అమెరికాలోని ఇతర దేశాల నిపుణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మానసిన వేదన అమెరికా ప్రభుత్వానికి తెలిసేలా పెద్ద ఎత్తున ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి.