ఘోరం : డెలివరీ అయిన వారానికే కరోనాతో లేడీ డాక్టర్ మృతి !

Update: 2021-05-13 07:30 GMT
హైదరాబాద్‌ లో ఓ మహిళా డాక్టర్ కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందడం ఆందోళన కల్గిస్తోంది. ప్రాణాలని పణంగా పెట్టి కరోనా బాధితులకి ట్రీట్మెంట్ చేసే కరోనా యోధులు కూడా ఆ మహమ్మారి భారిన పడి కన్నుమూస్తుండటం విచారకరం. తాజాగా ఓ మహిళా డాక్టర్ ప్రసవం తర్వాత కేవలం వారం రోజుల వ్యవధిలోనే కరోనా కారణంగా కన్నుమూసింది.   హైదరాబాద్‌ పాత బస్తి లోని ప్రిన్సెస్ ఎస్రా ఆసుపత్రిలో డాక్టర్ ఫర్హా నీలౌఫర్  వైరస్ బారిన పడి కన్నుమూశారు. గజ్వెల్‌ లోని ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఏరియా హాస్పిటల్‌ లో పనిచేస్తున్న డాక్టర్ మహమ్మారి సమయంలో కూడా సేవలు అందించారు. గర్భిణీ కావడంతో , ఆమె స్నేహితులు మరియు సహచరుల సూచనలు చేస్తున్నా కూడా కరోనా బాధితులకి అండగా ఉండాలని నిర్ణయం తీసుకోని ప్రసూతి సెలవులు తీసుకోలేదు.

కరోనా విధుల్లో ఉన్న ఆమె కి సుమారు 10 రోజుల క్రితం ఆమె కోవిడ్‌ టెస్ట్ చేయగా ..  పాజిటివ్ గా తేలడంతో  హైదరాబాద్‌ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చింది. డాక్టర్ ఫర్హా షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబిబిఎస్  , హైదరాబాద్ లోని నీలౌఫర్ హాస్పిటల్ నుండి ఎండి పీడియాట్రిక్స్  పూర్తీ చేశారు. పీడియాట్రిక్స్ లో  అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన ఆమెను గజ్వెల్ లోని ఏరియా హాస్పిటల్ లో క్లినికల్ అసోసియేట్ గా నియమించారు. ఓ లేడీ డాక్టర్ అతి తక్కువ వయస్సులోనే మరణించడంతో వైద్యుల బృందం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. గజ్వెల్ ఆసుపత్రిలో డాక్టర్ ఫర్హా సహచరులు ప్రసూతి సెలవు తీసుకోవాలని ఆమెకు సలహా ఇచ్చారని, అయితే ఆమె వారి సూచనలను పట్టించుకోలేదని, మహమ్మారి సమయంలో ఆసుపత్రికి ఆమె సేవలు అవసరమని చెప్పారు. ఈ కరోనా సెకండ్ వేవ్ లో  తెలంగాణ ఇప్పటివరకు 21 మంది వైద్యులను కోవిడ్ చేతిలో ప్రాణాలు కోల్పోయారని ఓ ప్రముఖ మీడియా లో ప్రసారం అవుతోంది. కరోనా వైరస్ పంజా విసురుతున్న తరుణంలో ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే వైరస్ భారిన పడి , మరణిస్తుండటం  ఆందోళన కల్గిస్తోంది.
Tags:    

Similar News