యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా ఒక సంచలన వ్యాఖ్య చేశారు సౌదీ ఆరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్. ప్రపంచాన్ని నడిపిస్తున్న చమురు ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయన్న వార్నింగ్ తో ఒక్కసారి అందరి చూపులు ఆయన మీదకు మళ్లాయి. ఉన్నట్లుండి.. ఆయన ఇలా ప్రకటన చేయటంతో చమురు ధరల మీద కొత్త ఆందోళనలు మొదలయ్యేలా చేశాయని చెప్పాలి.
అయితే.. ఈ వ్యాఖ్యలన్ని కూడా సౌదీ యువరాజు వ్యూహాత్మకంగా చేశారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. తాజాగా ఒక ఇంగ్లిషు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ప్రపంచ దేశాలన్ని కలిసికట్టుగా ఇరాన్ ను కట్టడి చేయకపోతే.. చమురు ధరలు ఎవరూ ఊహించని రీతిలో పెరుగుతాయని చెప్పారు.
ఈ ప్రకటనపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ విషయంలో ప్రపంచ దేశాలు కఠిన వైఖరి అనుసరించాలి. లేకుంటే చమురు వెలికితీతపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ గుండెలు అదిరే మాటలు చెప్పారు. ప్రపంచం వ్యాప్తంగా ముడిచమురును భారీగా ఎగుమతి చేసే దేశాల్లో సౌదీ కీలకమన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరి.. సౌదీ యువరాజు ప్రకటన మీద అగ్రరాజ్యాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. మొత్తంగా ఎక్కడో ఏదో జరిగితే.. దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీదా ఉంటుందనటానికి తాజా ఉదంతం చక్కటి ఉదాహరణగా చెప్పక తప్పదు.