డీఎండీకే నేత విజయ్ కాంత్ వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కెప్టెన్ ఈ క్రమంలో ఆసక్తికర సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో జట్టుకట్టిన ప్రజా సంక్షేమ కూటమి (పిడబ్ల్యూఎఫ్)కి గుడ్ బై చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయనే స్వయంగా ప్రకటించారు.
2011 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన విజయ్ కాంత్ తాజాగా జరిగిన తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సంక్షేమ కూటమితో జట్టు కట్టిన ఆయన ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. కింగ్ మేకర్ అవుతారనుకున్న 'కెప్టెన్' చివరకు కుదేలయ్యారు. 'అమ్మ' హవాకు కొట్టుకుపోయారు. డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ప్రజా సంక్షేమ కూటమి (పీబ్ల్యూఎఫ్)తో ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ కాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన విజయ్ కాంత్ తన సీటు కూడా కాపాడుకోలేకపోయారు. ఉలందూరుపేట నుంచి పోటీ చేసిన కెప్టెన్ డిపాజిట్ కూడా కోల్పోయి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు వచ్చాయి.