ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవన్ లోకి చొచ్చుకు రావటం.. వారిని నిలువరించేందుకు కాల్పులు జరపటం.. నలుగురు మరణించటం తెలిసిందే. తాజాగా గాయపడిన ఒక పోలీసు అధికారి కూడా మరణించారు. అమెరికా చరిత్రలో ఇలాంటి ఉదంతం చాలా అరుదు. అమెరికా చట్టసభలకు కేరాఫ్ అడ్రస్ అయిన క్యాపిటల్ భవనంలోకి ఆందోళనకారులు చొచ్చుకురావటం ఒక ఎత్తు అయితే.. నిరసనకారుల చేతుల్లోని ఒక జెండా అమెరికన్లను భయాందోళనల్లోకి నెట్టేస్తుంది. ఇంతకీ ఆ జెండా ఏమిటి? తొలిసారి అది ఏకంగా క్యాపిటల్ భవనంలోకి రావటం దేనికి నిదర్శనం? ఇంతలా ఆందోళన చెందటానికి కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే.. కొత్త విషయాలు చాలానే కనిపిస్తాయి.
క్యాపిటల్ టవర్ ను ముట్టడించటం ఒక ఎత్తు అయితే.. ఆ నిరసనలో ఎగిరిన జెండా మరో ఎత్తు అంటున్నారు. అమెరికా గమనానికి కొత్త ప్రశ్నలు లేవనెత్తేలా ఆ జెండా ఉంటుందని చెబుతున్నారు. ట్రంప్ మద్దతుదారుల చేతుల్లో కనిపించిన ఆ జెండాను.. కాన్ఫెడరేట్ జెండా అని చెబుతారు. దీన్ని.. అమెరికాలోని తెల్లవారి అధిపత్యానికి.. అమెరికా సామాజిక..రాజకీయ రంగాల్లో శ్వేతేతరులను తిరస్కరించటానికి ఈజెండాను ప్రతీకగా చెబుతారు.
అమెరికా అన్నంతనే వివిధ జాతుల సమ్మేళనం. ప్రపంచ స్వేచ్ఛకు నిదర్శనంగా అమెరికాను అభివర్ణిస్తారు పలువురు. అలాంటి దేశంలో కురచ భావాలకు.. సంకుచిత మనస్తత్వాలకు చోటు ఉండదు.కానీ.. ఇటీవల కాలంలో ఆ భావనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ జెండా రాక గురించి మరింత తెలుసుకోవటానికి ముందు చరిత్రలోకి వెళ్లి రావాల్సిన అవసరం ఉంది.
1861-65మధ్యన అమెరికాలో అంతర్యుద్ధం చోటు చేసుకుంది. ఆ సందర్భంగా ఈ జెండాను రూపొందించారు. లింకన్ అధ్యక్షుడిగా ఎన్నికై.. దేశంలో బానిసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. దీంతో.. ఆ దేశంలో సివిల్ వార్ చోటు చేసుకుంది. లింకన్ కు .. ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా అమెరికాలోని 11 రాష్ట్రాలు దేశం నుంచి విడిపోయి.. కాన్ఫడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఏర్పడ్డాయి. బానిసత్వాన్ని రద్దు చేసి.. నల్లజాతీయుల్ని కూడా జనజీవన స్రవంతిలో కలపాలని అధ్యక్షుడు లింకన్ నిర్ణయించారు. దీంతో.. బానిసత్వంపై ఆధారపడిన రాష్ట్రాలు (సౌత్ కరోలినా.. మిసిసిపి.. ఫ్లోరిడా.. అలబామా..జార్జియా.. టెక్సాస్) ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.
దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే.. ఈ రాష్ట్రాల్లోని వ్యవసాయం.. ఇతర పనులకు బానిసల్ని ఎక్కువగా వినియోగించే వారు. వారంతా ఆఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చినవారే ఎక్కువ. దీంతో.. వారి ప్రయోజాల కోసం తమ లబ్థిని దెబ్బ తీస్తున్నారని శ్వేతజాతీయులు భావించేవారు. తమ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తున్న అధ్యక్షుడు లింకన్ ను కిడ్నాప్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. కొంతకాలం పాటు సివిల్ వార్ జరిగింది. అధ్యక్షులవారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి పోరాడిన రాష్ట్రాలు చివరకు1885లో చేతులు ఎత్తేశాయి. దీంతో అంతర్యుద్ధం ముగిసింది. శ్వేతజాతి అధికారానికి ప్రతీకగా చెప్పే కాన్ఫెడెరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది మాయమైంది.
కానీ.. ఈ సివిల్ వార్ అమెరికా చరిత్రలో మచ్చగా మిగిలింది. సొంత ప్రజల మీద పోరాడుతూ 6.2లక్షల మంది అమెరికా సైనికులు మరణిస్తే.. లక్షల మంది ప్రజలు మరణించారు. అంతర్యుద్ధం సాగుతున్న వేళలోనే అధ్యక్షుడు లింకన్ బానిసత్వాన్ని రద్దు చేశారు. దీంతో సుమారు రెండు లక్షల మంది నల్లజాతీయులు అమెరికా సైన్యంలో చేరారు. ఇదంతా 1865లో జరిగింది. అలా కాలగర్భంలో చేదు అనుభవంగా ఉన్న ఘటనకు ప్రతీకగా చెప్పే కాన్ఫెడెరేట్ జెండా.. ఇంతకాలానికి ఈ డిజిటల్ యుగంలో బయటకు రావటం.. అది కూడా ఏకంగా క్యాపిటల్ భవనంలోకి ఎంట్రీ ఇవ్వటం అమెరికన్లలో కొత్త ఆందోళనకు కారణంగా చెప్పాలి.