ఏపీలో ఆ ఎమ్మెల్యేలకు పనిలేకుండా పోయిందా?

Update: 2020-08-08 15:30 GMT
అంతా ఒక్కడే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మొత్తం ‘జగన్నా’టకమే.ఆయనే కర్త కర్మ క్రియ. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మిథ్య. సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్ ఇందులో ఎవరికీ ఎలాంటి పాత్ర లేకుండా అంతా ఆయనే చేస్తున్నాడనే టాక్ నడుస్తోంది. దీంతో వైసీపీలోని నేతలు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా జగన్ కనిపిస్తున్నాడట.. ఏమీ చేయలేక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లో ప్రజల్లోకి వెళ్లిలేకపోతున్నారనే బాధ వారిలో వ్యక్తమవుతోందని ఆఫ్ ది రికార్డ్ లో వారంతా తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. దీనిపైనే ఇప్పుడు వారిలో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఏపీ సీఎం జగన్ ఒక కొత్త విధానంతో పరిపాలిస్తున్నాడు.. ప్రజాప్రతినిధులకు పనిలేకుండా చేస్తున్నాడని ఎమ్మెల్యేలు మథనపడుతున్నారు. ఏపీ సీఎం పాలన ఈజీగా చేస్తున్నాడు అని పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది. సంక్షేమ పథకాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన వారందరికీ ఇస్తున్నాడు. దీంతో ఎమ్మెల్యేలకు భౌతికంగా ఏమీ పని లేకుండా చేస్తున్నాడు. వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల్లోనే అంతా పని అయ్యేటట్టు చేస్తున్నాడు. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలు కాకపోయినా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి నేరుగా సీఎం ప్రజల దగ్గరికి వెళ్లి సంక్షేమ పథకాలు ఆరాతీయాలని యోచిస్తున్నాడట.. సీఎం అడిగితే ఎవరి జోక్యం లేకుండా మీరే ఇచ్చారు అనే పరిస్థితికి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించారని టాక్ నడుస్తోంది.

ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు భయపడుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మా పేరు ఎక్కడా వినపడకుండా అవుతోందని.. రాబోయే ఎన్నికల్లో మా పేరు సర్వేలో రాదు కాబట్టి మేము దాదాపు ఔట్ అయ్యే పరిస్థితి ఉంటుందని ఆందోళన చెందుతున్నారట.. ఒకవేల పార్టీ మారినా 5 ఏళ్లలో మేము ఏమీ పని చేయలేదని.. ప్రజల దగ్గర ఓట్లు ఎలా పడుతాయని ఎమ్మెల్యేలు దిగులు పడుతున్నారట.. ఎమ్మెల్యేలంతా ఏమీ చేయాలో పాలుపోవడం లేదని కొందరు బహిరంగంగానే అంటున్నారు.
Tags:    

Similar News