అద్దెకు భార్యలు.. అందంగా ఉంటే జాక్ పాటే..!

Update: 2021-11-11 09:36 GMT
పెళ్లి చేసుకునే ముందు ప్రతీఒక్కరూ ఈడు జోడు చూసుకోవడం కామన్. ఇందులో అమ్మాయి, అబ్బాయి ఈక్వేషన్స్ వేర్వురుగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఇందులో మొదట అందం ఆ తర్వాత చదువు.. డబ్బు.. గుణగుణాలు వగైరా ఉంటాయి. వీరిద్దరిలో కామన్ పాయింట్ మాత్రం అందమే ఉంటుంది.

ప్రతీ అమ్మాయి తనకు రెక్కల గుర్రం మీద వచ్చే రాకుమారుడు వరుడిగా కావాలని కోరుకుంటే.. అబ్బాయి సైతం సౌందర్యరాశితోపాటు తనకు కావాల్సినవి చేసిపెట్టే అమ్మాయి కావాలని కోరుకోవడం చూస్తూనే ఉంటాం. సినిమాల్లోనూ ఇవే చూపిస్తారుగా.. ఇక అసలు విషయానికిస్తే భార్య అందాన్ని క్యాష్ చేసుకోనే భర్తలు మనదేశంలో ఉండటం మాత్రం శోచనీయంగా మారింది.

విదేశాల్లో డేటింగ్ కల్చర్ పెరిగాక భార్యలను అద్దెకిచ్చె సంఘటనలు తరుచూ కన్పించాయి. ఇలాంటివి విదేశాల్లో ఇటీవల కామన్ అయిపోగా మనదేశంలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయంటే మాత్రం ఆశ్చర్యం కలుగకమానదు. అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో నెలకొంది. ఈ ప్రాంతంలో ఓ తెగకు చెందిన భర్తలు తమ భార్యలను అద్దెకివ్వడం గమనార్హం.

ఇక్కడికి ఎవరైనా వచ్చి ఏ వ్యక్తి భార్యనైనా అద్దెకు తీసుకునే వెలుసుబాటు ఉంటుంది. వారాలు.. నెలలు.. సంవత్సరం ఇలా గడువుపై భార్యను అద్దెకు తీసుకోవచ్చు. అవసరమైతే వీరితో పిల్లలను కూడా కనొచ్చు. అయితే ప్రతీ దానికో రేటు ఫిక్స్ అయి ఉంటుంది. అలాగే అద్దె గడువు ముగిశాక సదరు భార్యను అసలు భర్త ఇంటికి పంపించాల్సి ఉంటుంది.

భార్య అందాన్ని బట్టి రోజుకు 2వేల నుంచి లక్ష వరకు అద్దె ఉంటుంది. దీనికి పెద్దల సమక్షంలో అగ్రిమెంట్ సైతం ఉండటం గమనార్హం. ఈ ప్రాంతంలో కేవలం భార్యలే కాకుండా పెళ్లికాని అమ్మాయిలను సైతం అద్దెకు ఇస్తారట. దీనిని ఈ తెగ వారంతా ‘ధడిచా’ అనే అచారంగా భావిస్తారు. కాగా ఈ ఆచారం మాత్రం ఆ ప్రాంతానికి పరిమితం.

ఏదిఏమైనా భార్య అందాన్ని క్యాష్ చేసుకోవాలని భర్తలు చూడటం అనేది మాత్రం నిజంగా శోచనీయమని చెప్పొచ్చు. అయితే మరికొందరు మాత్రం ఈ ప్రాంతంలో అందమైన భార్య ఉంటే ఆ భర్త మాత్రం జాక్ పాట్ కొట్టినట్లేనని కామెంట్ చేస్తుండటం విడ్డూరంగా మారింది.
Tags:    

Similar News