జీతాలు రాక జ‌గ‌న్ ను క‌లిసి ఆదుకోమ‌న్నారు

Update: 2017-06-15 08:04 GMT
త‌న పాల‌న గురించి గొప్ప‌గా చెప్పుకుంటారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. త‌న సారథ్యంలో ఏపీ వెలిగిపోతోంద‌ని.. త‌న చేతికి కానీ అధికారాన్ని మ‌రింత కాలం ఇస్తే.. జాతీయ స్థాయిలోనూ... అంత‌ర్జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాన్ని దూసుకెళ్లేలా చేస్తాన‌ని చెబుతుంటారు. మ‌రి ఇన్ని గొప్ప‌లు చెప్పే బాబు నేతృత్వంలో ఏపీ స‌ర్కారు తీరు వాస్త‌వంలో వేరుగా ఉంటుంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తుంటాయి.

తాజాగా ఆ వాద‌న‌కు బ‌లం చేకూరే ఉదంతం ఒక‌టి చోటు చేసుకుంది. ఏపీ విప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌డ‌ప‌లోని పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న్ను కొంద‌రు మ‌హిళ‌లు క‌లిశారు. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని నిర్వ‌హించే నిర్వాహ‌కుల‌కు గ‌డిచిన కొద్ది నెల‌లుగా జీతాలు ఇవ్వ‌టం లేద‌ని వారు వాపోయారు. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని బ‌డా సంస్థ‌కు అప్ప‌గించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని.. ఏడు నెల‌లుగా త‌మ‌కు జీతాలు ఇవ్వ‌లేద‌ని.. బిల్లులు చెల్లించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు త‌మ‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుండ‌టంపై త‌మ‌ను ఆదుకోవాల‌ని జ‌గ‌న్‌ను కోరారు.

త‌న‌ను క‌లిసిన మ‌హిళ‌ల ఆవేద‌న‌ను విన్న జ‌గ‌న్‌.. వారి స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో మాట్లాడ‌తాన‌ని.. వారికి న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని మాట ఇచ్చారు. మ‌ధ్యాహ్న భోజ‌న నిర్వాహ‌కుల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా ఉండేలా.. వారికి న్యాయం జ‌రిగేందుకు కృషి చేస్తాన‌ని మాట ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News