యోగీ ఎఫెక్ట్ : మ‌ళ్లీ బుల్డోజ‌ర్ ట్రీట్మెంట్ ?

Update: 2022-06-13 09:30 GMT
శాంతి భ‌ద్ర‌త‌ల క‌ట్ట‌డికి దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా యూపీ స‌ర్కారు బుల్డోజ‌ర్ ట్రీట్మెంట్-కు ఉప‌క్ర‌మిస్తుంది. ముఖ్యంగా మ‌త హింస‌కు సంబంధించి నిందితుల‌పై ఉక్కు పాదం మోపుతోంది. నిందితుల ఇళ్ల‌ను నేల మ‌ట్టం చేయడం ద్వారా ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల‌కు తీవ్ర హెచ్చ‌రిక‌ల‌నే జారీ చేస్తోంది.

దీంతో యూపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌లు కొన్ని విమ‌ర్శనాత్మ‌కం అవుతున్నాయి. కొన్నింట ప్రశంస‌లు అందుకుంటున్నాయి. తాజాగా నిన్న‌టి వేళ ఓ బుల్డోజ‌ర్ ట్రీట్మెంట్-కు యూపీ సీఎం యోగీ సిద్ధం అయ్యారు. అనుకున్న‌ది సాధించారు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు తావిస్తోంది. అయితే అల్ల‌ర్ల‌ను క‌ట్ట‌డి చేసే ప‌ద్ధ‌తి ఇది కాద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ను ఉద్దేశించి బీజేపీ అధికార ప్ర‌తినిధి నుపుర్ శ‌ర్మ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కార‌ణంగా దేశ వ్యాప్తంగా అల‌జ‌డులు రేగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మొన్న‌టి వేళ అట్టుడికి పోయింది. అదేవిధంగా ప‌శ్చిమ బెంగాల్ , హావ్ డా జిల్లాలో అల్ల‌ర్లు రేగాయి. రాళ్ల దాడి జ‌రిగింది.

రాంచీలో కూడా ఇదేవిధంగా ఉద్రిక్త‌త‌లు నెల‌కొని ఉన్నాయి. యూపీలో వివిధ ప్రాంతాల‌లోల జ‌రిగిన దాడుల‌కు సంబంధించి 304 మందిని అరెస్టు చేశారు. ఒక్క యూపీలోనే కాదు ఢిల్లీలో కూడా అల్ల‌ర్ల‌కు కార‌ణం అయిన వారిని వెతికి పట్టుకునే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు. ఢిల్లీలోజామా మ‌సీదు వ‌ద్ద శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించిన ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశార‌ని తెలుస్తోంది. మరోవైపు వీడియో ఫుటేజీల ఆధారంగా మ‌రికొంద‌రిని అరెస్టు చేసేందుకు వీలుంద‌ని  తెలుస్తోంది.

మ‌రోవైపు ఒక‌ప్పుడు అల్ల‌ర్ల‌కు కార‌ణం అయిన వారి ఇళ్ల‌ను కూల్చివేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం కూడా ఇప్పుడు వార్త‌ల్లో నిలుస్తోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్, ప్ర‌యాగ్ రాజ్ లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల బాధ్యుడి ఇంటిని నిన్న‌నే బుల్డోజ‌ర్ తో కూల్చివేశారు. ఇది అక్ర‌మ నిర్మాణం అని, మే 10 న నోటీసులు ఇచ్చామ‌ని పోలీసులు అంటున్నారు. అదేవిధంగా జార్ఖండ్ రాజ‌ధాని రాంచిలో కూడా భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం ఇచ్చే వారిపై బుల్డోజ‌ర్ ట్రీట్మెంట్ ఇక‌పై కూడా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు కాంగ్రెస్ మాత్రం త‌న వాద‌న మ‌రో విధంగా వినిపిస్తోంది. అల్ల‌ర్లు జ‌రిగిన ప్రాంతాల‌కు వెళ్లేందుకు, వాస్తవిక ప‌రిస్థితులు తెలుసుకునేందుకు పోలీసులు త‌మ‌ను అనుమ‌తించ‌డం లేద‌ని ప‌శ్చిమ బెంగాల్ విప‌క్ష నేత సువేందు అధికారి మండిప‌డుతున్నారు. త‌నను పోలీసులు అడ్డుకోవ‌డంపై తూర్పు మేడినిపుర్, తుమ్లుక్ లో చోటు చేసుకున్న నాట‌కీయ ప‌రిణామాల‌పై కోర్టు కు పోతాన‌ని ఆయ‌న అంటున్నారు.
Tags:    

Similar News