రేణు దేశాయ్ మాటేంటి పవన్!?

Update: 2018-12-04 03:32 GMT
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. సహ‍నానికి మారుపేరు. రాజకీయ నాయకుడిగా పరిణతి సాధించిన నాయకుడు. ప్రజా నాయకుడిగా ప్రజాక్షేత్రంలో ఏది మాట్లాడాలో... ఏది మాట్లాడకూడదో స్పష్టంగా తెలుసుకున్న నాయకుడు. అంతే కాదు... తాను అధికారంలోకి వస్తే ఏ పని చేయగలనో... ఏ హామీ నెరవేర్చగలనో అదే చెప్పే నాయకుడు. ఇదంతా తెలుగు ప్రజలే కాదు..... అధికార పక్ష‌ సభ్యుల్లో కూడా ఉన్న భావ‌న‌. అయితే ఇవేవీ పట్టని... ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు పవన్ కల్యాణ్ స్ధాయిని దాటి ఉన్నాయని అంటున్నారు.

నాలుగు గోడల మధ్య నుంచి బయటకు రానివ్వని పిల్లి కూడా తన పై దాడిని ధీరత్వంతో ఎదుర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పులిలా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల పై మాత్రం తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలకు తావివ్వని జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మ‌న ప‌విత్ర‌మైన వివాహ వ్య‌వ‌స్థ‌ను రోడ్డు మీద‌కు లాగిన ప‌వ‌న్‌కల్యాణ్ తనను విమర్శించడం ఆకాశం పై ఉమ్ము వేయడం వంటిదేనని అంటున్నారు.

" పవన్ కల్యాణ్ మగతనం గురించి మాట్లాడుతున్నాడు. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చడం మగతనం అవుతుందా. భారతదేశంలో పెళ్లికి అత్యంత పవిత్రమైనదిగా గుర్తింపు ఉంది. అలాంటి ఈ సంప్రదాయాన్ని పవన్ కల్యాణ్ రోడ్డు మీదకు తీసుకొచ్చారు. నాలుగేళ్లకు ఒకసారి పెళ్లి చేసుకోవడం, నిత్య పెళ్లికొడుకులా మారడమే  మగతనమా" అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ భార్య రేణుదేశాయ్ పై పవన్ కల్యాణ్ అభిమానులు చేసిన దాడిన ప్రస్తావించిన జగన్ " రేణుదేశాయ్ ని ఓ మహిళాగా... క‌నీసం నీ మాజీ భార్యగా గుర్తించి ఆమెకు మద్దతుగా నిలవకపోవడం నీ మగతనమా" అని జగన్ జనసేనాని పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు.  రేణు దేశాయ్ తో కాపురం చేస్తూనే పవన్ కల్యాణ్ వేరే మహిళతో సంబంధాలు పెట్టుకుని ఏకంగా బిడ్డను కూడా కన్నారని, ఇది మగతనం అనిపించుకుంటుందా అని విరుచుకుపడ్డారు.

ఎదుటి వారిని విమర్శించే సమయంలో తాము ఎలాంటి వారో తెలుసుకోవాలని పవన్ కల్యాణ్ కు ప్రతిపక్ష నేత జగన్ సూటిగా ప్రశ్నించారు. నిజాలు చెప్పిన రేణు దేశాయ్ పై పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో దారుణమైన ప్రకటనలు చేశారని, ఆ సమయంలో పవన్ కల్యాణ్ కనీసం స్పందించలేదని జగన్ అన్నారు. రాజకీయాల్లో పరిపూర్ణత అంటే నోటికొచ్చినట్లు  మాట్లాడడం కాదని ఆయన హితవు పలికారు.
Tags:    

Similar News