రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన రాజన్న కుమార్తె షర్మిల రాజకీయ పార్టీకి సంబంధించి మరో అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఇప్పటికే పలు వర్గాలతో భేటీ అవుతూ.. వారి నుంచి సలహాలు.. సూచనలు తీసుకుంటున్న ఆమె.. తన పార్టీని మే 14న పెట్టే అవకాశం ఉందంటున్నారు. అయితే.. పార్టీకి సంబంధించిన పేరు.. వివరాల్ని మాత్రం వచ్చే నెల తొమ్మిదిన వెల్లడిస్తారని చెబుతున్నారు. ఈ తేదీనే షర్మిల ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే.. దానికి కారణం లేకపోలేదంటున్నారు.
2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రకు శ్రీకారం చుట్టింది ఏప్రిల్ తొమ్మిదిన. దీంతో సెంటిమెంట్ పరంగా బాగుండటంతో పాటు.. వైఎస్ అభిమనులు.. సానుభూతిపరుల్ని ఇట్టే కనెక్టు చేసేందుకు ఈ తేదీ అనువుగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే.. ఈ తేదీని పార్టీ అధికార ప్రకటన తేదీగా డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక.. పార్టీ పేరు విషయానికి వస్తే.. మూడు పేర్లను షార్ట్ లిస్టు చేసినట్లుగా సమాచారం. ఈ మూడింటిలో ఏదో ఒక పేరును ఫైనల్ చేస్తారంటున్నారు.
అందులో ఒకటి వైఎస్ ఆర్ టీపీ.. రెండోది వైఎస్ ఆర్ పీటీ అన్న పేర్లతో పాటు.. రామన్న రాజ్యం అన్న పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఏప్రిల్ తొమ్మిదిన పార్టీ పేరును.. గుర్తును.. పార్టీ విధివిధానాలు ఏమిటన్న విషయాల్ని కూడా ఆమె వెల్లడించనున్నట్లు చెబుతున్నారు. తనను ఆంధ్రా ప్రాంతానికి చెందినట్లుగా వేస్తున్న ముద్రకు ఇప్పటికే గట్టిగా కౌంటర్ ఇచ్చిన షర్మిల తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షర్మిల రాజకీయ పార్టీ వ్యవహారంపై కాంగ్రెస్.. బీజేపీనేతలు బలంగా ప్రశ్నిస్తుంటే.. అధికార టీఆర్ఎస్ కు చెందిన నేతల్లో మాత్రం ఒకరిద్దరు తప్పించి.. మిగిలిన వారు మౌనంగా ఉండటం ఆసక్తికరంగా మారింది.