పాపం పండింది.. బెదిరించి రేప్ చేసినోడు చచ్చాడు

Update: 2020-02-12 11:15 GMT
చేసిన తప్పునకు మూల్యం చెల్లించాల్సిందే. పాపం చేస్తే అందుకు తగ్గ ఫలితం అనుభవించక తప్పదని పలువురు శపిస్తుంటారు. ఈ మాటల్లో నిజమెంతన్నది పక్కన పెడితే.. తాజాగా ఒక ప్రమాదం గురించి తెలిసినప్పుడు.. ఏ మాత్రం బాధ అనిపించదు. తగిన శాస్తి జరిగిందన్న భావన కలగటం ఖాయం. ఇంతకూ జరిగిందేమంటే..

నిన్న (మంగళవారం) సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మహిళ తన పన్నెండేళ్ల కొడుకుతో కలిసి కర్ణాటక లోని బీదర్ కు వెళ్లి తెలంగాణ ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కు బయలుదేరింది. ఆమె వెంట పెద్ద మూట ఉంది. ఆమెతో పాటు ఉన్న మూటలో నిషేధిత వస్తువులు ఉన్నాయంటూ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తనిఖీ పేరుతో బస్సు దిగాలని ఆదేశించారు.

జహీరాబాద్ పస్తాపూర్ చౌరస్తాలో దిగిన ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళుతున్నట్లు చెప్పి.. బ్యాంకు వద్ద ఆమె కుమారుడ్ని.. మరొకడ్ని ఉంచి తనతో తీసుకెళ్లి.. బలవంతంగా అత్యాచారానికి  పాల్పడ్డాడు. పొద్దున్నే ఈ మహిళను అక్కడి స్థానికులు ఎవరన్న ప్రశ్నకు.. జరిగింది చెప్పుకుందా మహిళ. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలన్న సూచనతో కంప్లైంట్ ఇచ్చింది.

ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు వారి ఆచూకీ వెతికేందుకు రంగంలోకి దిగారు. అయితే.. మహిళను బెదిరించి అత్యాచారం చేసిన నిందితులు కారులో పారిపోయారు. అయితే.. పోలీసులు తమను పట్టుకుంటారన్న భయంతో వేగంగా కారును నడిపిన వారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో నిందితుడు ఒకరు మరణించగా.. మరో నిందితుడ్ని.. అతడి వెంట ఉన్న ఇంకొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించినప్పుడు దారుణమైన నిజాన్ని వీరు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది.  మహిళల్ని బెదిరింపులకు గురి చేసి వారిపై లైంగికంగా దాడి చేసే అలవాటున్న ముఠాగా వీరిని గుర్తించారు.
Tags:    

Similar News