బుద్వేల్ వేలంలో ప్లాట్లు సొంతం చేసుకున్నదెవరో తెలిస్తే అవాక్కే

మొత్తం వంద ఎకరాలకు సంబంధించి నిర్వహించిన వేలంలో అత్యధికం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలే సొంతం చేసుకోవటం గమనార్హం.

Update: 2023-08-15 04:37 GMT

ఒకటి తర్వాత ఒకటి చొప్పున భూమల వేలాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. పలు వెంచర్లలో భూముల వేలాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న భూముల వేలం ఇప్పుడు కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. ఇటీవల రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ లో భూములకు సంబంధించి నిర్వహించిన ఈ వేలంలో ప్లాట్లను సొంతం చేసుకున్న వారికి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

మొత్తం వంద ఎకరాలకు సంబంధించి నిర్వహించిన వేలంలో అత్యధికం ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలే సొంతం చేసుకోవటం గమనార్హం. మొత్తం ప్లాట్లలో 8 ప్లాట్లు మైహోం.. ప్రిస్టీజ్ సంస్థల చేతికే వెళ్లాయి. కోకాపేటలో నిర్వహించిన రెండు దశల వేలంలోనూ ప్లాట్లను దక్కించుకున్న మైహోం బుద్వేల్ లోనూ ఆసక్తిని ప్రదర్శించింది. 14 ప్లాట్లలో ఐదు ప్లాట్లు మైహోంకు దక్కగా.. మూడు ప్రెస్టీజ్ సంస్థకు దక్కాయి. మిగిలిన ఆరు ప్లాట్లను వేర్వేరు సంస్థలకు ఈ వేలంలో సొంతం చేసుకున్నాయి.

మొత్తం వంద ఎకరాల్లో మైహోం సొంతం చేసుకున్న ప్లాట్ల విస్తీర్ణం 43 ఎకరాలకు పైనే ఉండగా.. ప్రెస్టీజ్ గ్రూపు 24 ఎకరాలను సొంతం చేసుకుంది. అంటే.. మొత్తం వంద ఎకరాల్లో ఈ రెండు సంస్థల చేతికే 67 ఎకరాలు వెళ్లగా.. లింగమనేని హోల్డింగ్స్ 5ఎకరాలు.. శ్రీవాణి ఇన్ ఫ్రా 10.5 ఎకరాలు.. సన్ సైన్ హైసింగ్ 6.9 ఎకరాలు.. భగవతిదేవి 6.1 ఎకరాలు.. త్రివేణి రెడ్డి 3.4 ఎకరాలు.. ఎస్ సీఎన్ ప్రాజెక్టు 4.5 ఎకరాల భూమి సొంతమైంది.

బుద్వేల్ వేలంలో సొంతమైన భూమి మొత్తం బడా సంస్థల చేతికే వెళ్లటం రియల్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బుద్వేల్ భూముల వేలంలో భారీగా భూమిని సొంతం చేసుకున్నరెండో సంస్థ అయిన ప్రెస్టీజ్ గ్రూపునకు ఈ భూముల పక్కనే భారీ వెంచర్ ఉండటం మరో విశేషం.

Tags:    

Similar News