4 బెడ్ రూం ఫ్లాట్ రెంట్ నెలకు రెండున్నర లక్షలు!

అద్దె కోసం వెళ్లిన వారికి ఇంటి యజమానులు చెబుతోన్న రెంటు నెలకో ఏడాదికో తెలియక బుర్ర తిరుగుతున్న పరిస్థితి ఎదురవుతుంది!

Update: 2023-07-29 23:30 GMT

బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఇంటి అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. అద్దె కోసం వెళ్లిన వారికి ఇంటి యజమానులు చెబుతోన్న రెంటు నెలకో ఏడాదికో తెలియక బుర్ర తిరుగుతున్న పరిస్థితి ఎదురవుతుంది! ఆ స్థాయి లో ఇంటి యజమానులు రేట్లు పెంచేశార ని అంటున్నారు. తాజాగా అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్ లలోని ధరలు చూస్తే పట్టపగలు, మిట్టమధ్యాహ్నం కూడా చుక్కలు కనిపించడం కన్ ఫాం!!

అవును... కరోనా రాకముందు అంటే 2020 కంటే ముందు హైదరాబాద్‌, బెంగళూరుల లో ఇంటి అద్దె ధరలు కాస్త అందుబాటు లో ఉండేవి. ఏరియాలను బట్టి ధరల్లో కాస్త వ్యత్యాసం కూడా ఉండేది. హైదరాబాద్ లో ఐటీ ఆఫీసులు ఎక్కువగా ఉండే మాదాపూర్, గచ్చిబౌలి తో పాటు కొండాపూర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో కరోనాకి ముందు కూడా రెంటులు కాస్త అందుబాటు లోనే ఉండేవి.

అయితే కోవిడ్ సమయం లో వర్క్ ఫ్రం హోం పెరగడం.. హైదరాబాద్ లో వీదికి పది టూలెట్ బోర్డులు కనిపించడం కామన్ అయిపోయింది. అయితే ఈ మధ్యకాలం లో వర్క్ ఫ్రం హోం ఎపిసోడ్ క్లోజ్ అయ్యి.. తిరిగి ఉద్యోగులంతా ఆఫీసుల బాట పడుతుండటంతో... మళ్లీ అద్దె ధరల కు రెక్కలు వచ్చాయి.. అలా వచ్చిన రెక్కలు సాధారణ పక్షుల్లా కాకుండా... రాబందుల్లా అంతెత్తుకి వెళ్లిపోతున్నాయి.

కోవిడ్ కి ముందు కాస్త ఐటీ జనాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు రూ.21,000 నుంచి రూ.24,000 మధ్య దొరికేది. ప్రస్తుతం ఆ ఏరియాల్లో డబుల్ బెడ్ రూం అద్దె రూ.30,000 - రూ.33,000 మధ్య ఉంది. ఇక త్రిబుల్ బెడ్ రూం అయితే... రూ. 32,000 నుంచి రూ.43,000 వరకు పెరిగింది. ఈ అద్దెలతో ఒక సాధారణ ఉద్యోగి ఎలా బ్రతకాలనేది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది.

ఇదే సమయం లో కొన్ని గేటెడ్ కమ్యూనిటీల లో త్రిబుల్ బెడ్ రూం రెంట్ రూ. 60,000 నుంచి రూ. 65,000 మధ్య నడుస్తోంది. ఇక గచ్చిబౌలి లోని హై – ఎండ్ గేటేడ్ కమ్యునిటీలో త్రిబుల్ బెడ్ రూం రెంట్ రూ.75,000 నుంచి లక్ష రూపాయల వరకూ ఉందని అంటున్నారు.

ఈ సమయం లో బెంగళూరు లో నాలుగు బెడ్ రూంస్ ఫ్లాట్ ధర ను ఆన్ లైన్ లో పోస్ట్ చేశాడు ఒక యజమాని! ఆ పొస్ట్ లో 4 బెడ్ రూంస్ ఫ్లాట్ ధర నెలకు రెండున్నర లక్షలు కాగా... అడ్వాన్స్ రూ.25 లక్షలు అని ఉంది. దీంతో ఈ పోస్ట్ బెంగళూరు లో అద్దె ఇంటి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోందని అంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... దీనికి లోన్ ఆప్షన్ కూడా ఉందని ఆ పోస్ట్ లో మెన్షన్ చేయగా... కిడ్నీ డొనేషన్ ఆప్షన్ ఏమీ లేదా అంటూ నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. ఇదే సమయం లో నిన్నమొన్నటివరకూ ఉన్న రెంటు కంటే.. తాజాగా ఏడాదిలోపే 15వేల రూపాయలు పెంచేశాడని మరో వ్యక్తి ఆన్ లైన్ వేదికగా వాపోతోన్న పరిస్థితి!

మరి ముందు ముందు ఈ అద్దెంటి ధరలు ఏ స్థాయికి వెళ్లిపోతాయో చూడాలి. వీటి ధరలు అదుపుచేసే ఆలోచన ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయేమో వేచి చూడాలి!

Tags:    

Similar News