3వ స్థానికి డౌన్.. డబ్ల్యూటీసీ ఫైనల్..టీమ్ ఇండియాకు ఇక కష్టమే?

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో వరుసగా మూడోసారి ఫైనల్ చేరాలన్న టీమ్ ఇండియా ప్రయత్నం నెరవేరేలా లేదు.

Update: 2024-12-08 11:33 GMT

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో వరుసగా మూడోసారి ఫైనల్ చేరాలన్న టీమ్ ఇండియా ప్రయత్నం నెరవేరేలా లేదు. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా 0-3తో పరాజయం పాలుకావడంతో పాటు ఆస్ట్రేలియాతో గులాబీ బంతితో రెండో టెస్టులో దారుణ ఓటమి మరింత దెబ్బకొట్టింది.

హ్యాట్రిక్ చేజారినట్టే?

డబ్ల్యూటీసీ ఫైనల్ లో రెండుసార్లు (ఒకసారి న్యూజిలాండ్, మరోసారి ఆస్ట్రేలియా) ఓడిన టీమ్ ఇండియాకు మూడోసారి కచ్చితంగా మెరుగైన అవకాశాలున్నాయి. కానీ, న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ దెబ్బకొట్టింది. అయితే, తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్ లో మొదటి టెస్టును గెలవడంతో పరిస్థితి కాస్తమెరుగైంది. అయితే, అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం చేటు చేసింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దిగజారింది.

ఆస్ట్రేలియా టాప్ లోకి వచ్చింది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా కొనసాగుతోంది. శ్రీలంక, ఇంగ్లండ్ 3, 4 స్థానాల్లో ఉన్నాయి. మార్చి నాటికి టాప్‌-2 జట్లు ఫైనల్స్ చేరతాయి.

పింక్ బాల్ తో జరిగిన అడిలైడ్ టెస్టుకు ముందు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 61.11 శాతంతో తొలి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ ఓటమితో పాయింట్ల శాతం 57.59 శాతానికి తగ్గింది. ఆస్ట్రేలియా పాయింట్లు 57.69 శాతం నుంచి 60.71 శాతానికి పెరిగాయి.

దక్షిణాఫ్రికా (59.26 శాతం), శ్రీలంక (50 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్‌ (44.23)పై విజయంతో ఇంగ్లండ్ (45.24 శాతం) ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది.

ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా మరో మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటి అన్నిట్లో నెగ్గినా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం అనుమానమే.

Tags:    

Similar News