బంతికి ఉమ్మి రాయొచ్చు.. కీలక రూల్ సవరణ.. ఐపీఎల్ లో బౌలర్లకు పండుగే

ఐపీఎల్ 18వ సీజన్ లో ఇప్పటికే చాలా రూల్స్ మారిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఆటగాడు మధ్యలో వైదొలగితే రెండేళ్ల నిషేధం సహా మరెన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.;

Update: 2025-03-20 16:30 GMT

మరికొన్ని గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మొదలుకానుంది.. ఇప్పటికే ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశారు. వివిధ కారణాల రీత్యా ఒకరిద్దరు మినహా అందరూ జట్టుతో చేరిపోయారు. ఇక మిగిలింది ప్రారంభ సన్నాహమే. ఈ నెల 22 నుంచి 2 నెలల పది రోజులు పండుగే పండుగ.

ఐపీఎల్ 18వ సీజన్ లో ఇప్పటికే చాలా రూల్స్ మారిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఆటగాడు మధ్యలో వైదొలగితే రెండేళ్ల నిషేధం సహా మరెన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వీటన్నిటి ప్రకారం చూస్తే వచ్చే సీజన్ అత్యంత జనరంజకంగా ఉంటుందని స్పష్టం అవుతోంది.

తాజాగా ఐపీఎల్ లో మరో రూల్ మారింది. ఇప్పటివరకు బంతికి ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎత్తివేసింది. ఈ మార్పు బౌలర్లకు పండుగే అని చెప్పాలి.

టి20 క్రికెట్ అంటేనే బ్యాట్స్ మెన్ గేమ్. వీరి ఎడాపెడా బాదుడుతో ఎంత మంచి బౌలర్లు అయినా బలి కావాల్సిందే. ఇలాంటి సమయంలో బంతికి ఉమ్మి రుద్దడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం బౌలర్లకు మేలు చేసేదే. మరీ ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు.

గురువారం ముంబైలో ఐపీఎల్ జట్ల కెప్టెన్ల సమావేశంలో అత్యధిక శాతం కెప్టెనప్లు బంతికి ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనే ప్రతిపాదనకు అంగీకరించారు. వారి అభిప్రాయం మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

రివర్స్ స్వింగే ఇక..

బంతికి ఉమ్మి పూయడం వెనుక ఉద్దేశం.. బంతిని రివర్స్ స్వింగ్ చేయడం. బ్యాట్స్ మెన్ ను బోల్తాకొట్టించేందుకు పరిమిత ఓవర్ల కంటే టెస్టుల్లో ఇలా ఎక్కువ శాతం చేస్తారు. కానీ, కరోనా వ్యాప్తి తర్వాత బంతిపై ఉమ్మి రుద్దడాన్ని బీసీసీఐ బ్యాన్ చేసింది. అదే ఐపీఎల్‌ కూ వర్తింపజేశారు. టీమ్ ఇండియా, న్యూజిలాండ్ స్టార్ పేసర్లు షమి, టిమ్‌ సౌథీతో పాటు చాలామంది పేసర్లు ఈ నిబంధన తొలగించాలని కోరారు. కరోనా ప్రభావం పూర్తిగా పోవడంతో ఇప్పటికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఐపీఎలో తొలగించడంతో ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News