ఐపీఎల్ 2025 : సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ను ఆడేసుకుంటున్నారుగా!

రాబోయే ఐపీఎల్ సీజన్ కు ఇంకా ఒక నెల రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2025-02-27 11:34 GMT

రాబోయే ఐపీఎల్ సీజన్ కు ఇంకా ఒక నెల రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐపీఎల్ 2025 గురించి సోషల్ మీడియా అంతటా చర్చ నడుస్తోంది. ఈ సందర్భంలో ఒక ప్రత్యేకమైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.


ఇది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫోటో. అతను ఈ సీజన్‌కి సీఎస్కే కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సీఎస్కే అతని కెప్టెన్సీ బాధ్యతలను అధికారికంగా ప్రకటించేందుకు ఈ ఫోటోను రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. రుతురాజ్ గైక్వాడ్ ఫోటోపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇది చర్చనీయాంశంగా మారింది. సీఎస్కే అతనిపై పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయాలని చూసింది, కానీ పూర్తి విరుద్ధమైన పరిణామం జరిగింది.

సోషల్ మీడియా వినియోగదారులు రుతురాజ్‌కు ఐపీఎల్ లో ఉన్న ఇతర కెప్టెన్లతో పోల్చితే చాలా తక్కువ క్రేజ్ ఉందని కామెంట్ చేస్తున్నారు. సీఎస్కే షేర్ చేసిన ఈ ఫోటో అతనిపై మరింత ట్రోలింగ్‌కు కారణమవుతోంది. మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో కెప్టెన్‌గా రుతురాజ్ వచ్చినా ధోనికి వచ్చినంత పాపులారిటీ రుతరాజ్ కు రావడం అన్నది అసాధ్యమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ధోని నీడలో కెప్టెన్సీ చేయడమే ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్‌కు తలనొప్పిగా మారింది.

అయితే రుతురాజ్ టాలెంటెడ్ ఆటగాడు. అతనికి కొంత సమయం ఇవ్వాలి. ధోనీ సృష్టించిన లెగసీని కొనసాగించేందుకు అతను తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.

అందువల్ల చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా టీమ్ రుతురాజ్‌పై ఇలాంటివి క్రియేట్ చేసే ప్రయత్నాలను మానుకోవడం మంచిది. ఎందుకంటే, ఈ విధానం అసలు సీఎస్కే కెప్టెన్సీకే మచ్చ తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News