2025.. టీమ్ ఇండియా రిటైర్మెంట్ సంవత్సరం..
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్.. 2024లో రిటైరైన టీమ్ ఇండియా క్రికెటర్లు
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్.. 2024లో రిటైరైన టీమ్ ఇండియా క్రికెటర్లు.. వీరిలో ధావన్ మినహా అందరూ జట్టులో సభ్యులుగా ఉన్నప్పుడే తప్పుకొన్నారు..
మరి 2025లో...? విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా రిటైర్ అవుతారా..? ఇప్పటికే జట్టుకు దూరమైన ఇద్దరు బ్యాట్స్ మెన్ అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా కూడా తప్పుకోనున్నారా? వీరితో పాటు అనూహ్యంగా మరో ఆటగాడు కూడా గుడ్ బై చెబుతాడా..?
పరిస్థితులు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది.. టెస్టు క్రికెట్‌లో 537 వికెట్లు తీసిన దిగ్గజ బౌలర్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్ కాగా లేనిది.. మిగతావారు రిటైర్ అవరని గ్యారెంటీ ఏమిటి?
సిరీస్ లు లేవు..
2025లో టీమ్ ఇండియాకు జూన్ వరకు టెస్టు మ్యాచ్ లు లేవు. ఆస్ట్రేలియాతో జనవరిలో చివరి టెస్టు ముగిశాక ఇంగ్లండ్ తో స్వదేశంలో ఐదు టి20లు, మూడు వన్డేల సిరీస్ ఉంది. ఫిబ్రవరితో ముగిసే ఈ సిరీస్ తర్వాత జూన్ లోనే ఇంగ్లండ్ వెళ్లి ఐదు టెస్టులు ఆడనుంది. కోహ్లి, రోహిత్, జడేజా టి20లకు వీడ్కోలు చెప్పారు. కోహ్లి, రోహిత్ లు వన్డేలకూ వీడ్కోలు పలుకుతారా? అసలు జడేజాను పరిగణిస్తారా? లేదా? చూడాలి. దీంతోనే 2025 భారత క్రికెట్ కు రిటైర్మెంట్ సంవత్సరం కానుందని అంటున్నారు.
జూన్ లో లార్డ్స్ లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు టీమ్ ఇండియా అర్హత సాధించకుంటే.. జట్టులో కచ్చితంగా మార్పులు ఉంటాయట. వయసు ప్రకారం చూసినా రోహిత్, కోహ్లీ, జడేజాలు ఇప్పటికే చివరి ఆస్ట్రేలియా టూర్ చేస్తున్నారు. వీరి స్థానాలను భర్తీ చేసేందుకు జట్టు మేనేజ్ మెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకోనుందట. కుర్రాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వనుందట. 2008లో గంగూలీ, కుంబ్లే ఒకే సిరీస్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నట్లుగానే 2025లోనూ జరగనుందట.