బిగ్ బాస్.. ఆమెను ఎందుకు తీసుకొచ్చావయ్యా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరోనని ఆసక్తిగా అంతా వెయిట్ చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరోనని ఆసక్తిగా అంతా వెయిట్ చేస్తున్నారు. మరిన్ని వారాల్లో విన్నర్ ఎవరో తేలిపోనుంది. అదే సమయంలో ఇప్పుడు హిందీలో బిగ్ బాస్ 18వ సీజన్ నడుస్తోంది. ఈసారి కూడా బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖానే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
తెలుగులో మరికొద్ది రోజుల్లో సీజన్ ముగియనుండగా.. హిందీ బిగ్ బాస్ 18 ఫినాలేకి ఇంకా సమయం ఉంది. అయితే రీసెంట్ గా ముగ్గురు బ్యూటీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదితి మిస్త్రీ, యామిని మల్హోత్రా, ఐడెన్ రోజ్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ముగ్గురూ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నారు. వారి పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
అయితే అదితి మిస్త్రీ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న అదితి.. ఎప్పటికప్పుడు హీట్ పుట్టించే ఫిక్స్ షేర్ చేస్తుంటారు. ఓ ఫిట్ నెస్ ట్రైనర్ అయిన ఆమె.. అనేక సెగలు రేపి ఫోటోస్ ను పోస్ట్ చేస్తుంటారు. అవి తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి.
అదే సమయంలో అదితి పోస్ట్ చేసే డ్యాన్స్ వీడియోస్, రీల్స్ బోల్డ్ గా ఉంటుంటాయి. కొన్ని అభ్యంతకరంగా కూడా ఉంటాయి. దీంతో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడంపై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఆ నిర్ణయం అనేక మందిపై ఎఫెక్ట్ చూపిస్తుందని, తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని చెబుతున్నారు.
ఫేమస్ అవ్వాలంటే.. యాక్టింగ్ లేదా ఇంకా ఏ ఫీల్డ్ లో అయినా టాలెంట్ చూపించుకోవాలి కానీ అలాంటి వీడియోస్ ను అదితి పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. కానీ అది వ్యక్తిగత అభిప్రాయమైనా.. ఇప్పుడు అదితిని టీఆర్పీ కోసమే బిగ్ బాస్ లోకి తీసుకొచ్చినట్లు అర్థమవుతుందని నెటిజన్లు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా నిర్వాహకులు ఇలా చేశారని గుర్తు చేస్తున్నారు.
అప్పుడు సన్నీలియోన్ ను టీఆర్పీ కోసమే తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. కానీ బిగ్ బాస్ నిర్వాహకుల ప్లాన్ సక్సెస్ అయిందని చెబుతున్నారు. ఇప్పుడు అలా జరగలేదని అంటున్నారు. అనుకున్న స్థాయిలో టీఆర్పీలో గ్రోత్ రానట్లు అనిపిస్తుందని అంటున్నారు. కాబట్టి బిగ్ బాస్.. ఏజ్ తో సంబంధం లేకుండా అంతా చూస్తారు కనుక.. ఎవరినైనా కంటస్టెంట్‌గా తీసుకురావడానికి ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఫ్యూచర్ లో నిర్వాహకులు ఏం చేస్తారో వేచి చూడాలి.