ఈ వారం ఓటీటీ కంటెంట్.. టాప్ సినిమాలివే!

అన్ని భాషలకి సంబందించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఒకే ప్లాట్ ఫామ్ లో వస్తూ ఉండటంతో ప్రేక్షకులకి కావాల్సింది ఎంపిక చేసుకొని చూసుకునే వెసులుబాటు ఉంది.

Update: 2024-05-01 04:11 GMT
ఈ వారం ఓటీటీ కంటెంట్.. టాప్ సినిమాలివే!
  • whatsapp icon

డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి వారం కావాల్సినంత వినోదం అందుతోంది. అన్ని భాషలకి సంబందించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఒకే ప్లాట్ ఫామ్ లో వస్తూ ఉండటంతో ప్రేక్షకులకి కావాల్సింది ఎంపిక చేసుకొని చూసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు ఓటీటీల ద్వారా యూనివర్శలైజ్ అయ్యింది. విదేశీయులు మన ఇండియన్ సినిమాలని వీక్షించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అలాగే ఇండియన్స్ కొరియన్ వెబ్ సిరీస్ ల పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. హాలీవుడ్ పై ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ఇక ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతి ఓ సారి చూసుకుంటే ఇలా ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ హీరామండీ వెబ్ సిరీస్ మే 1న రిలీజ్ అవుతోంది. వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళల జీవితాల నేపథ్యంలో లాహోర్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన కథగా పీరియాడిక్ జోనర్ లో దీనిని తెరకెక్కించారు. దీనిపై నార్త్ ఇండియన్ ఆడియన్స్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ సైతాన్ మే 3న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో మాధవన్ విలన్ గా నటించాడు. థ్రిల్లర్ జోనర్ లో మూవీ ఉండబోతోంది. అలాగే ది ఏ టిపికల్ ఫ్యామిలీ కొరియన్ వెబ్ సిరీస్ మే 4న అందుబాటులోకి రానుంది. టిపి బాన్ అనే యానిమేషన్ సిరీస్ మే2న విడుదల కాబోతోంది. అలాగే హాట్ స్టార్ లో మలయాళీ సూపర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ మూవీ ఐదు భాషలలో మే 5న రిలీజ్ అవుతోంది.

జియో సినిమాలో హాలీవుడ్ లో వొంకా 2023 మే 3 నుంచి స్ట్రీమింగ్ లోకి రానుంది. అదే రోజు హాలీవుడ్ వెబ్ సిరీస్ హాక్స్ 3, ది టాటూయిస్ట్ ఆఫ్ ఆష్‌విట్జ్ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో ది ఐడియా ఆఫ్ యు అనే హాలీవుడ్ సినిమా మే 2 నుంచి ప్రసారం కాబోతుండగా క్లార్క్‌సన్ ఫార్మ్ వెబ్ సిరీస్ సీజన్ 3 కూడా ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఆహా ఓటీటీలో వైభవ్ హీరోగా నందితా శ్వేతా, తాన్యా హోప్ ఫీమేల్ లీగ్ గా వచ్చిన 'రణం ఆరం తవరెల్ మూవీ మే 1న రిలీజ్ అయ్యింది.

నెట్ ఫ్లిక్స్

హీరామండీ (వెబ్ సిరీస్) - మే 1

సైతాన్ (హిందీ మూవీ) - మే 3

ఏ టిపికల్ ఫ్యామిలీ(కొరియన్ డ్రామా) - మే 4

హాట్ స్టార్

మంజుమ్మల్ బాయ్స్ - మే 5

జియో సినిమా

వొంకా 2023 (హాలీవుడ్ మూవీ) - మే 3

హాక్స్ 3 (హాలీవుడ్ వెబ్ సిరీస్ - మే 3

ది టాటూయిస్ట్ ఆఫ్ ఆష్‌విట్జ్ ( వెబ్ సిరీస్) - మే 3

అమెజాన్ ప్రైమ్ వీడియో

ది ఐడియా ఆఫ్ యు (హాలీవుడ్ మూవీ) - మే 2

క్లార్క్‌సన్ ఫార్మ్ సీజన్ - 3 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - మే 3

ఆహా

రణం ఆరం తవరెల్ (తమిళ్ మూవీ) - మే 1

Tags:    

Similar News