జోతిష్యం: దీపిక‌కు ర‌ణ‌వీరుడే పుడ‌తాడు!

దీపిక పదుకొనే గ‌ర్భ‌ధార‌ణ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్. బేబి బంప్‌తో దీపిక ఎక్క‌డ క‌నిపించినా వెంట‌నే దానిపై డిస్క‌ష‌న్లు పెడుతున్నారు.

Update: 2024-07-05 15:30 GMT

దీపిక పదుకొనే గ‌ర్భ‌ధార‌ణ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్. బేబి బంప్‌తో దీపిక ఎక్క‌డ క‌నిపించినా వెంట‌నే దానిపై డిస్క‌ష‌న్లు పెడుతున్నారు. పుట్ట‌బోయేది జూనియ‌ర్ ర‌ణవీరుడా? లేక జూనియ‌ర్ దీపిక‌నా? అంటూ డౌట్లు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అలాంటి వారికి నిర‌భ్యంత‌రంగా ``పుట్ట‌బోయేది మ‌గ బిడ్డే``న‌ని చెబుతున్నారు జ్యోతిష్కులు. జూనియ‌ర్ ర‌ణ‌వీర్ సింగ్ ని ఇంటికి ఆహ్వానించ‌బోతోంద‌ని దీపిక‌పై జోశ్యం చెబుతున్నారు. అస‌లింత‌కీ జోశ్యుడు చెప్పిందేమిటో పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జంట దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ సెప్టెంబర్ 2024లో తల్లిదండ్రులయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. రణవీర్ సింగ్ ఫిబ్రవరి 29న సోషల్ మీడియాలో గర్భధారణ వార్తలను ప్రకటించారు. అయితే ఆడపిల్ల పుడుతుందా? లేక మ‌గ‌ బిడ్డ పుడుతున్నాడా? అన్న‌ది తెలుసుకోవాల‌ని అభిమానుల ఆస‌క్తి. ఓ వైపు `కల్కి 2898 AD` విజ‌యాన్ని ఆస్వాధిస్తున్న దీపికా పదుకొణె బేబి బంప్ తోనే త‌న సినిమాకి ప్ర‌మోష‌న్ చేసిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో ఈ గ‌ర్భంపై చాలా స‌ర‌దా జోకులే వేసారు స‌హ‌న‌టులు. వేదిక అంతా న‌వ్వుల‌తో నిండిపోయింది.

ప్రముఖ జ్యోతిష్కుడు- ఫేస్ రీడర్ అయిన పండిట్ జగన్నాథ్ గురూజీ ఈ జంట మగబిడ్డకు స్వాగతం పలుకుతారని జోస్యం చెప్పారు. ఇదే జ్యోతిష్యుడు గ‌తంలో దీపిక ఎప్పుడు గ‌ర్భం దాలుస్తుందో కూడా చెప్పాడు. ``2024లో దీపికా పదుకొణె గర్భం దాల్చనుంద‌ని, తల్లిదండ్రులకు యువరాజుగా ఉండే మగబిడ్డతో ఆశీర్వాదం అందుకుంటార‌``ని చెప్పాడు. బాలుడు చ‌క్క‌ద‌నంతో అదృష్టంతో పుట్టాలని ఆశిస్తున్నట్లు కూడా చెప్పాడు.

నవంబర్ 1న విడుదల కానున్న రోహిత్ శెట్టి `సింగం ఎగైన్‌`లో దీపిక -రణవీర్ సింగ్ జంట‌గా క‌నిపిస్తారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ ఖాన్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.

Tags:    

Similar News