ఆదిపురుష్.. ఇది నష్టాల లెక్క!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ ఆదిపురుష్. ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొంది. భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఏకంగా 270 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రామాయణం కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కించారు.
అయితే రామాయణం కథలోని పాత్రల చిత్రణ, కథనం ఔచిత్యం దెబ్బ తీశారని ఆదిపురుష్ మూవీపై హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ముఖ్యంగా ఓం రౌత్, రైటర్ మనోజ్ కి వ్యతిరేకంగా నిరనసలు తెలియజేశారు. అయితే వారు చేసిన తప్పుని గ్రహించి కరెక్షన్ చేసుకునేలోపే సినిమాకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వారి ఆలోచనని రామాయణం కథ అనుసరించే ఎవరూ కూడా యాక్సప్ట్ చేయలేకపోయారు.
ఆదిపురుష్ సినిమా డిజాస్టర్ అని ఇప్పటికే కన్ఫర్మ్ అయిపొయింది. అయితే కలెక్షన్స్ పరంగా ఈ మూవీ ఏ స్థాయిలో నష్టాలు మిగిల్చింది అనేది కూడా తేలిపోయింది. వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ తాజాగా బయటకొచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 175 కోట్లకి సొంతం చేసుకొంది. అయితే ఓవరాల్ గా 100 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ అయ్యింది.
దీంతో ఒక్క తెలుగు మార్కెట్ లోనే 75 కోట్ల నష్టం ఆదిపురుష్ పై వచ్చింది.ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ 270 కోట్లకి గాను కేవలం 185 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగింది. దీంతో నష్టం 85 కోట్ల నష్టంతో ఆదిపురుష్ క్లోజింగ్ అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కెరియర్ లో హైయెస్ట్ లాస్ ఉన్న సినిమాగా ఆదిపురుష్ నిలిచింది. రాధేశ్యామ్ మూవీ 110 కోట్ల నష్టాలని మిగిల్చింది.
సాహో మూవీ కూడా 65 కోట్ల నష్టాన్ని సిల్వర్ స్క్రీన్ దగ్గర నిలిచింది. తెలుగులో కూడా సెకండ్ హైయెస్ట్ లాస్ వచ్చిన చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. ఆచార్య మూవీ 86 కోట్ల నష్టాలు మిగిల్చింది. తరువాత 75 కోట్లతో ఆదిపురుష్ సెకండ్ స్థానంలో, అజ్ఞాతవాసి 70 కోట్ల నష్టంతో మూడో స్థానంలో ఉండటం విశేషం.