పుష్ప 2: యూఎస్ లో మరో సరికొత్త రికార్డు

ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్న బన్నీ ఫ్యాన్స్ కూడా సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారని అనిపిస్తోంది

Update: 2024-11-22 11:34 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2: ది రూల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులలో భారీ అంచనాలను సృష్టించింది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్న బన్నీ ఫ్యాన్స్ కూడా సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే ప్రీమియర్స్ కు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

తాజాగా, ఈ సినిమా యూఎస్ ప్రీమియర్‌లకు సంబంధించిన టికెట్‌ విక్రయాలలో ఒక అరుదైన ఘనత సాధించింది. విడుదలకు ముందే యూఎస్‌లో 40,000 పైగా టికెట్లు అమ్ముడవ్వడం ఇండియన్ సినిమా చరిత్రలో చాలా అరుదైన విషయం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న యూఎస్‌లో ప్రీమియర్ షో ద్వారా విడుదల చేయనున్నారు, అయితే ఈ ఘనత ఈ సినిమాకు సంబంధించి భారీ క్రేజ్‌ను స్పష్టంగా సూచిస్తుంది. ఇదే సెన్సేషన్ ద్వారా పుష్ప 2కు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ ఉందొ చెప్పవచ్చు.

ఈ చిత్రానికి సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కించి, యాక్షన్, భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. పుష్ప 1: ది రైజ్ లో అల్లు అర్జున్ తన డిఫరెంట్ స్టైల్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేశాడు, ఇక సీక్వెల్ చిత్రంలో మరింత మాస్ లుక్‌తో కనిపించబోతున్నారు. తాజా పోస్టర్‌లో అల్లు అర్జున్ అమ్మవారి దుస్తుల్లో ఉన్న భిన్నమైన గెటప్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ సినిమాకీ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అంధించగా ఇప్పటికే విడుదలైన సాంగ్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. సినిమాకు కీలకమైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. పుష్ప 2: ది రూల్ అనేది కేవలం భారతీయ ప్రేక్షకుల కోసం కాకుండా, పాన్-వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల మనసులను గెలుచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇదే కాకుండా, మైత్రీ మూవీ మేకర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా ఇప్పటికే భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

టికెట్ సేల్స్‌తో పాటు, ఓటిటి, శాటిలైట్ రైట్స్ ద్వారా మేకర్స్ భారీ లాభాలను పొందుతున్నారు. డిసెంబర్ 5న గ్లోబల్‌గా విడుదలకు సిద్ధమైన పుష్ప 2: ది రూల్ ప్రేక్షకులను ఎంతలా మెప్పిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పకుండా వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు.

Tags:    

Similar News