పిక్‌టాక్ : అందమైన నభా చీర కట్టు నడుము ఒంపులు..!
చాలా రోజుల తర్వాత నభా నటేష్ నడుము అందం చూపిస్తూ చీర కట్టు ఫోటోలను షేర్ చేసింది. ఫోటోలు షేర్ అయిన తక్కువ సమయంలోనే భారీ ఎత్తున లైక్స్, షేర్స్ దక్కించుకుంది.
2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నభా నటేష్. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి పేరు దక్కించుకుంది. ఆ సమయంలోనే స్టార్ దర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం వల్ల టాలీవుడ్‌లో ఈ అమ్మడికి మంచి ఫ్యూచర్ ఉందని అంతా భావించారు. అయితే కరోనా వల్ల ఈ అమ్మడి కెరీర్ ముందుకు వెనక్కి అయ్యింది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో అత్యధిక సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ కథ రివర్స్ అయ్యింది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చిన ఇమేజ్ నభా నటేష్ కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. అందుకే ఈ మధ్య కాలంలో ఆచితూచి సినిమాలను చేస్తోంది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటో షూట్ రెగ్యులర్‌గా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందంతో అలరించింది. ఈసారి చీర కట్టు ఫోటోలను షేర్ చేయడం ద్వారా నెటిజన్స్ చూపు తిప్పలేక పోతున్నారు. గతంలో ఎన్నో సార్లు మోడ్రన్ డ్రెస్‌లు, స్కిన్ షో చేసే ఫోటోలను షేర్ చేసింది. కానీ ఈసారి చాలా డీసెంట్‌గా చీర కట్టు ఫోటోలతో కన్ను తిప్పనివ్వడం లేదు.
సాధారణంగానే ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈసారి అంతకు మించి అన్నట్లు అందాల ఫోటోలు ఉండగా వైరల్ కాకుండా ఎలా ఉంటాయి. చాలా రోజుల తర్వాత నభా నటేష్ నడుము అందం చూపిస్తూ చీర కట్టు ఫోటోలను షేర్ చేసింది. ఫోటోలు షేర్ అయిన తక్కువ సమయంలోనే భారీ ఎత్తున లైక్స్, షేర్స్ దక్కించుకుంది. నభా నటేష్ చీర కట్టు ఫోటోలు చాలా అందంగా ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే ఇంత అందంగా ఉన్న నభా నటేష్‌ను ఎందుకు సినిమాల్లో తీసుకోవడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా కన్నడంలో ఒక సినిమా చర్చల దశలో ఉందని తెలుస్తోంది. త్వరలోనే తెలుగులో ఈమె నటించిన స్వయంభూ సినిమా విడుదల కాబోతుంది. చీర కట్టు ఫోటోలతో మతి పోగొడుతున్న నభా నటేష్ ముందు ముందు మరిన్ని ఆఫర్లు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు నటిగానూ మంచి మార్కులు దక్కించుకుంది. కనుక నభా నటేష్ హీరోయిన్‌గా మరిన్ని సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. చీర కట్టు ఫోటోలలు చూపు తిప్పనివ్వని కారణంగా టాలీవుడ్‌లో కచ్చితంగా భవిష్యత్తులో సినిమాలతో ఈ అమ్మడు బిజీ అయ్యేనా చూడాలి.