‘తండేల్’ థియేట్రికల్ బిజినెస్ – బ్రేక్ ఈవెన్ ఎంత?

చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది

Update: 2025-02-03 17:28 GMT

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అద్భుతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమా పెద్ద మొత్తంలో ఆదాయం రాబట్టింది.

సినిమా నెట్‌ఫ్లిక్స్ నుంచి రూ.35 కోట్లు, ఆడియో రైట్స్ రూపంలో రూ.7 కోట్లు, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా రూ.8 కోట్లు, శాటిలైట్ హక్కుల ద్వారా రూ.10 కోట్లు తీసుకుంది. మొత్తంగా నాన్-థియేట్రికల్ డీల్ రూ.60 కోట్లకు పైగా జరిగింది. ఇదిలా ఉంటే, సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు రూ.90 కోట్లుగా ఉందని సమాచారం. థియేట్రికల్ వసూళ్లు ఈ బడ్జెట్‌ను రికవర్ చేసేందుకు కీలకం కానున్నాయి.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ‘తండేల్’ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడం, అలాగే బన్నీ వాస్ నిర్మిస్తున్నారు కాబట్టి మార్కెట్ లో సినిమాకు మంచి డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేట్రికల్ హక్కులు రూ.13 కోట్లకు అమ్ముడుపోగా, తెలంగాణ కలిపి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ రూ.27.5 కోట్లుగా నమోదైంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు రూ.40 కోట్లుగా ఉందని సమాచారం. ఇటీవల టాలీవుడ్ లో వచ్చిన పలు పెద్ద సినిమాలకు థియేట్రికల్ హక్కులు భారీ మొత్తంలో అమ్ముడైన నేపథ్యంలో ‘తండేల్’కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఏపీ తెలంగాణలో భారీగా ఓపెనింగ్స్ రాబట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపుపై కూడా టీమ్ ఓపెన్ గా ఎదురు చూస్తోంది. ఇది కేవలం ఓ యాక్షన్ మూవీ మాత్రమే కాకుండా, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటికే IMDB లిస్టింగ్‌లో నంబర్ 1 మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన ఈ చిత్రం, థియేట్రికల్ రన్‌లో ఎలా దూసుకుపోతుందో చూడాలి. ఫిబ్రవరి 7న సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌

నెట్ ఫ్లిక్స్ - రూ.35 కోట్లు

ఆడియో రైట్స్ - రూ.7 కోట్లు

హిందీ రైట్స్ - రూ.8 కోట్లు

శాటిలైట్ - రూ.10 కోట్లు

టోటల్ - రూ.60 కోట్లు

సినిమా బడ్జెట్ దాదాపు రూ.90 కోట్లు.

తండేల్ థియేట్రికల్ బిజినెస్

ఆంధ్ర - రూ.13 కోట్లు

AP&TG - రూ.27.5 కోట్లు

బ్రేక్ ఈవెన్ - రూ.40 కోట్లు

Tags:    

Similar News