తండేల్.. టికెట్ రేట్ల పెంపు సంగతేంటి?

యువ సామ్రాట్ నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

Update: 2025-02-03 14:50 GMT

యువ సామ్రాట్ నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్య్సకారుల జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా చందూ మొండేటి తెరకెక్కించారు. నేచరుల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా సందడి చేయనున్నారు.

ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించగా, బన్నీ వాసు నిర్మించిన తండేల్ చిత్రం.. ఫిబ్రవరి 7వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే అనౌన్స్మెంట్ నుంచే మంచి అంచనాలు నెలకొల్పిన తండేల్ పై ఇప్పుడు ఆడియన్స్ లో భారీ బజ్ నెలకొంది. మేకర్స్ పక్కా ప్లాన్ తో ప్రమోషన్స్ చేయగా వేరే లెవెల్ హైప్ క్రియేట్ అయింది.

ముఖ్యంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్.. చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అలా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకోగా.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. మేకర్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూవీ టీమ్ అందరి ఖాతాలో హిట్ పడుతుందని అనుకుంటున్నారు.

అదే సమయంలో ఇప్పుడు తండేల్ టికెట్ రేట్ల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి చైతూ ముందు సినిమాల రిలీజ్ లకు టికెట్ ధరలు పెరగలేదు. కానీ ఇప్పుడు పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది. అది కూడా తెలంగాణలో కాదు.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. అందుకు కారణమేంటో అందరికీ తెలిసిందే.

ఒకప్పుడు తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగేవి. కానీ ఆంధ్రలో అలా జరిగేది కాదు. ఇప్పుడు పరిస్థితి చేంజ్ అయింది. పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో తొక్కిసలాట జరగడంతో రేట్లు పెంపు, అదనపు షోలకు అనుమతులు ఇవ్వమని టీజీ సర్కార్ ప్రకటించింది. రీసెంట్ గా ఓ సినిమాకు టికెట్ల రేట్లు పెంచినా మళ్లీ తర్వాత ఉత్తర్వులు రద్దు చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలకూ టికెట్ రేట్లు పెరిగాయి. ఎక్స్ ట్రా షోలకు అనుమతులు వచ్చాయి. ఇప్పుడు తండేల్ మేకర్స్.. టికెట్ రేట్ల పెంపు, అదనపు షోకు అనుమతి కోసం ఏపీ సర్కార్ నుంచి ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయో.. రేట్లు ఎంత పెరుగుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News